కేసు కొట్టేశారు సరే..మరి సీఐడీపై చర్యలొద్దా !?

ఏపీ పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఒకటి నారా లోకేష్‌పై నమోదు చేసిన కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు కాగా.. మరొకటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసు. తనపై సీఐడీ అధికారులు తప్పుడు కేసు పెట్టారని అంకబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు అంకబాబు వాదనను సమర్థించి కేసును కొట్టి వేసింది. తప్పుడు కేసు పెట్టిన సీఐడీపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?

అంకబాబు వయసు 73 ఏళ్లు. విజయవాడ ఎయిర్ పోర్టులో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఓ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. అదే ఆయన చేసిన నేరం. కేసులు పెట్టడమే కాదు.. ఆయన ఇంటి గోడలు దూకి దాదాపుగా పది మందిసీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.బట్టలు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా.. వయసు పరంగా వృద్ధుడైన వ్యక్తితో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

నిజంగా తప్పు చేసి ఉంటే అనుకోవచ్చు.. కానీ ఉద్దేశపూర్వకంగా.. కక్ష సాధింపు కోసమే.. ఆయన ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేని సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏదో ఒకటి చేయాలన్న దుర్బుద్దితోనే అరెస్ట్ చేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కేసు తప్పుడదని అర్థమైపోయింది. మరి ఆయనను మానసికంగా క్షోభ పెట్టిన సీఐడీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ప్రైవేటు కేసులు పెట్టి.బాధితులే పోరాడాలా లేకపోతే… మరోసారి ఇలాంటి వారు బాధితులు కాకుండా.. వ్యవస్థే ఏమైనా చర్యలు తీసుకుంటుందా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో కేసీఆర్ రోల్‌లో కేటీఆర్ !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ...

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన...

సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్ !

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్...

విజయ్, దిల్ రాజు పై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కాన్సిల్ !

విజయ్ దేవరకొండ, పరశురాం, దిల్ రాజు సినిమా ప్రకటన వచ్చింది. విజయ్, పరశురాం ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఇది క్రేజీ కాంబినేషన్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close