కొన్ని శుభాకార్యాలు జరిగేటప్పుడు అశుభాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రోటోకాల్ ప్రకారం జరిగిపోయినా.. మరికొన్నింటి విషయంలో అందరూ స్వచ్చందంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం అమరావతి శంకుస్థాపన విషయంలో అందరూ తీసుకున్నారు. అదేమిటంటే సాక్షి పత్రిక నీడ కూడా అమరావతిపై పడకుండా చేయడం.
అమరావతి రీ స్టార్ట్ అనేది పారిశ్రామిక వర్గాలకూ ఓ పండగ లాంటిదే. అక్కడ నిర్మాణ పనులు ప్రారంభమైతే.. వారి వ్యాపారాలు ఏ రేంజ్ లో పెరుగుతాయో చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలా మంది ఉత్సాహంగా పేపర్ ప్రకటనలు ఇచ్చారు. అమరావతి రీ స్టార్ట్ కు శుబాకాంక్షలు చెప్పారు. అయితే ఒక్కరంటే ఒక్కరూ సాక్షి పత్రికకు చిన్న ప్రకటన కూడా ఇవ్వలేదు. అన్ని పత్రికలు ప్రకటనలతో కళకళలాడితే సాక్షిపత్రిక మాత్రం… యాడ్స్ దివాలా తీసినట్లుగా కనిపించింది.
సాక్షి పత్రికకు ప్రకటనలు సేకరించేందుకు… సాక్షి మార్కెటింగ్ టీమ్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ అమరావతి గురించి ఒక్కటంటే ఒక్కటీ పాజిటివ్ గా రాయని పత్రికలో ప్రకటనలు ఇవ్వడం శుభశకునం కాదని ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం పోయిన వెంటనే జగన్ పత్రికకు ఆదాయం పడిపోయింది. ప్రకటనలు లేవు. సర్క్యూలేషన్ కూడా సగానికి పడిపోయింది. దీంతో సహజంగానే సాక్షి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.