‘గుణ‌’… గ‌ట్టెక్కించేవాళ్లెవ‌రు..?

ఆర్‌.ఎక్స్ 100తో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయాడు కార్తికేయ‌. చ‌డీ చ‌ప్పుడూ లేకుండా వ‌చ్చిన ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. నిర్మాత‌ల నెత్తిమీద కాసుల వ‌ర్షం కురిపించింది. దాంతో ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టి కార్తికేయ‌పై ప‌డింది. త‌న రెండో సినిమా ‘హిప్పీ’ భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది. ఈ సినిమాపై నిర్మాత‌ల అతి న‌మ్మ‌కం వ‌ల్ల – అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువే ఖ‌ర్చు పెట్టేశారు. ప‌బ్లిసిటీ కూడా భీక‌రంగా చేశారు. కానీ.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా చ‌తిక‌లిప‌డింది. క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చాలా ఏరియాల్లో నిర్మాత‌లే స్వ‌యంగా విడుద‌ల చేసుకోవ‌డం వ‌ల్ల – న‌ష్ట భారం మ‌రింత ఎక్కువైంది. రూపాయికి రెండు రూపాయ‌లు పెట్టి కొన్న నిర్మాత‌లు మొత్తం పోగొట్టుకున్నారు.

‘ఆర్‌.ఎక్స్ 100’తో వ‌చ్చిన హైపు.. ‘హిప్పీ’తో పోయింది. ఆ ప్ర‌భావం ఇప్పుడు ‘గుణ 369’పై ప‌డింది. బోయ‌పాటి శిష్యుడు అర్జున్ జంథ్యాల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా ఇది. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా బాగానే అయిన‌ట్టు టాక్‌. ‘ఆర్‌.ఎక్స్ 100’ని చూసి ‘గుణ‌’ని కొనేస్తార‌ని ఆశ ప‌డ్డారు. కానీ మ‌ధ్య‌లో `హిప్పీ` వ‌చ్చింది క‌దా.. ఆ ఫ్లాపుతో బ‌య్య‌ర్లు ఈ సినిమా వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. పైగా ఆగ‌స్టు 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఆ రోజే నాని సినిమా ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ విడుద‌ల అవుతోంది. నాని సినిమా అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ‘గుణ‌’ రిజ‌ల్ట్ ఏమాత్రం తేడాగా ఉన్నా – వ‌సూళ్ల ప‌రంగా బాగా ప్ర‌భావం చూపించేస్తుంది. అందుకే `గుణ‌`ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈసారి కూడా నిర్మాత‌లే ఈ సినిమాని సొంతంగా విడుద‌ల చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఈ సినిమాకి ఏదోలా ప‌బ్లిసిటీ పెంచి, హైప్ తెచ్చుకుని, ఏదో ఓ రేటుకి అమ్మేయాల‌ని నిర్మాత భావిస్తున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` అలాంటి క‌న్‌ఫ్యూజ్...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

HOT NEWS

[X] Close
[X] Close