జ‌డేజా… నువ్వు మ‌న‌సుల్ని గెలిచావ్‌!

సెమీస్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది.
అయితే ఒక్క‌డు మాత్రం భార‌త అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు. త‌నే ర‌వీంద్ర జ‌డేజా. ప్ర‌పంచ‌క‌ప్ కి ఎంపికైనా జ‌డేజాకు ఆడే అవ‌కాశ‌మే రాలేదు. ఇన్నాళ్లూ రిజ‌ర్వ్ బెంజ్‌కి ప‌రిమిత‌మైన జ‌డ్డూ… గ‌త రెండు మ్యాచ్‌ల‌లో టీమ్ 11లో చోటు సంపాదించుకోగ‌లిగాడు. సెమీస్‌లో టాప్ ఆర్డ‌ర్ చేతులెత్తేసిన వేళ‌, రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ.. ఇలాంటి బ్యాటింగ్ వీరులంతా వెనుదిరిగిన వేళ‌.. ధోనీకి ప‌రుగులు తీయ‌డ‌మే గ‌గ‌నం అనిపిస్తున్న వేళ‌… బ్యాట్ తో చెల‌రేగిపోయాడు జ‌డేజా. అచ్చ‌మైన బ్యాట్స్‌మెన్‌లా కివీస్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 59 బంతుల్లో 4 ఫోర్లూ, 4 సిక్స‌ర్ల‌తో 77 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోర‌ర్ జ‌డేజానే. త‌ను ఉన్నంత సేపూ… స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. ధోనీ కూడా జ‌డేజాకే ఎక్కువ స్ట్రైకింగ్ వ‌చ్చేలా చేశాడు. జ‌డ్డూ ఉన్నంత సేపూ.. భార‌త అభిమానుల‌కు గెలుపుపై న‌మ్మ‌కం ఉంది.

జ‌డేజా బ్యాటింగ్‌తో అల‌రించ‌డం ఇదేం కొత్త కాదు. ఇది వ‌ర‌కు కూడా చాలాసార్లు తన బ్యాటు ప‌దును చూపించాడు. అయితే ప్ర‌పంచ‌క‌ప్‌లో, అందులోనూ సెమీ ఫైన‌ల్లో త‌న బ్యాటింగ్, అభిమానుల్ని అబ్బుర ప‌రిచింది. `జ‌డేజాని నేను ఆల్ రౌండ‌ర్‌గా చూడ‌ను. త‌ను కేవ‌లం బౌల‌ర్ మాత్ర‌మే` అని ఇటీవ‌ల మంజ్రేక‌ర్ వ్యాఖ్యానించ‌డం, దానికి జ‌డేజా కూడా ధీటుగా స‌మాధానం ఇవ్వ‌డం క్రికెట్ అభిమానుల‌కు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు జ‌డేజా త‌న బ్యాట్‌తో కూడా స‌మాధానం ఇవ్వ‌గ‌లిగాడు. టీమ్ ఇండియా ఓడిపోవ‌డం.. భార‌త అభిమానుల‌కు చేదు వార్తే. కాక‌పోతే.. జ‌డేజా పోరాటం మాత్రం చిర‌స్మ‌ర‌ణీయం. జ‌డేజా ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ల‌లో ఈ మ్యాచ్ అత్యుత్త‌మ స్థానంలో ఉండిపోతుంది. మ్యాచ్‌కి గెలిపించి ఉంటేనా…, ఆ మ‌జా వేరుగా ఉండేది. కానీ ఏం చేస్తాం? బ్యాడ్ ల‌క్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close