బ‌న్నీ ఫంక్ష‌న్‌కి గెస్టులు లేరు

స‌రిలేరు నీకెవ్వ‌రు – అల వైకుంఠ‌పుర‌ములో రెండు సినిమాల మ‌ధ్య పోటీ మామూలుగా లేదు. వాళ్లో పాట రిలీజ్ చేస్తే, వీళ్లొక‌టి. వాళ్లు ఓ స్టిల్ వ‌దిలితే.. వీళ్లు రెండు. అలా సాగుతుంది వ్య‌వ‌హారం. యూ ట్యూబ్‌లో మాదే రికార్డు అంటే మాదే రికార్డు అంటూ పోస్ట‌ర్లు వేసుకుంటున్నారు. రిలీజ్ డేట్ వ్య‌వ‌హారం కూడా ముదిరి పాకాన ప‌డింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక‌లు ఎంత గ్రాండ్ గా చేయాలా అని చూస్తున్నారు.

స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీ రిలీజ్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. దీన్ని మెగా సూప‌ర్ ఈవెంట్‌గా పిలుస్తోంది చిత్ర‌బృందం. మెగాస్టార్‌, సూప‌ర్ స్టార్ క‌లిసి ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారు క‌దా. అందుకే ఆ పేరు పెట్టింది. మ‌హేష్ ఫంక్ష‌న్‌కి చిరు రావ‌డం నిజంగా అరుదైన విష‌య‌మే. ఇద్ద‌రు స్టార్ల‌ని ఓ చోట చూడ్డానికి రెండు క‌ళ్లూ స‌రిపోవు. మ‌హేష్ గురించి చిరు, చిరు గురించి మ‌హేష్ చెబుతుంటే విన‌డానికి కూడా ఆనందంగా ఉంటుంది. సో.. ఈ ఫంక్ష‌న్ సూప‌ర్ హిట్ అయిపోయిన‌ట్టే.

ఇక అల్లు అర్జున్ ఫంక్ష‌న్‌కి చిరంజీవి రావ‌డం ఓ ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈసారి ఆ ఛాన్సు మ‌హేష్ సినిమాకి ద‌క్క‌డంతో, బ‌న్నీ సినిమాకి గెస్టులు లేకుండా పోయారు. అయితే ఫంక్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. వేదిక‌పై బ‌న్నీ స్టెప్పులు వేయ‌డానికి, వేయించ‌డానికి కూడా రెడీ అయిపోయాడు. బ‌న్నీ సినిమా ఫంక్ష‌న్ జ‌రిగి రెండేళ్ల‌య్యింది. అందుకే ఈ కార్య‌క్రమం మొత్తానికి తానే సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిల‌బ‌డాల‌ని చూస్తున్నాడు. లైవ్ ఆర్కెస్ట్రా, త్రివిక్ర‌మ్ మాట‌లు ఇవి రెండూ ఈ ఫంక్ష‌న్‌కి బోన‌స్‌. మ‌రి ఎవ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌క్తి క‌డుతుందో చూడాలి. మొత్తానికి పోటీ మాత్రం అక్క‌డి నుంచే మొద‌లవ్వ‌డం మాత్రం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com