లైన్ క్లియ‌ర్‌: సంక్రాంతి విడుద‌ల‌లో మార్పు లేదు

హ‌మ్మ‌య్య‌… సంక్రాంతి రిలీజ్ డేట్ల టెన్ష‌న్ వ‌దిలిపోయింది. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాలు రెండూ ఒకే రోజున ఢీ కొట్టుకుంటాయా? వాటి విడుద‌ల తేదీ విష‌యంలో మార్పు ఉంటుందా? అనే గంద‌ర‌గోళానికి తెర ప‌డింది. ఈ సినిమాల విడుద‌ల తేదీల్లో ఎలాంటి మార్పూ లేదు. ముందు అనుకున్న‌ట్టే 11న స‌రిలేరు, 12న అల వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల కాబోతున్నాయి. ఈ విష‌యంలో ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఓ క్లారిటీ ఇచ్చింది.

కాసేప‌టి క్రితం హైద‌రాబాద్‌లోని దిల్ రాజు అత్య‌వ‌స‌ర మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి, ఈ విష‌యంలో ఓ క్లారిటీ ఇచ్చారు. రూమ‌ర్ల‌ని న‌మ్మ‌వ‌ద్ద‌ని, ముందు అనుకున్న‌ట్టే, అనుకున్న తేదీల్లోనే సినిమాలు విడుద‌ల అవుతాయ‌న్నారు. సినిమాల విడుద‌ల విష‌యంలో కాస్త గంద‌ర‌గోళం వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే అని, అయితే నిర్మాత‌ల‌తో మాట్లాడి ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించామ‌ని, ముందు అనుకున్న స‌మ‌యంలోనే సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌మ్మ‌తించార‌ని చెప్పారాయ‌న‌. ఒకేరోజు రెండు సినిమాలు విడుద‌లైతే, దేనికీ స‌రైన వ‌సూళ్లు రావ‌ని, అన్ని సినిమాలూ బాగుండాల‌ని, అన్ని సినిమాల‌కూ మంచి వ‌సూళ్లు రావాల‌ని, అందుకే అంద‌రూ కూర్చుని, ఈ స‌మ‌స్య ప‌రిష్కరించామ‌ని చెప్పారు. సో.. సంక్రాంతి రిలీజ్ డేట్ల టెన్ష‌న్ తీరిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close