నో కాంట్రాక్ట్..! ధోనికి రిటైర్మెంట్ గుర్తు చేసిన బీసీసీఐ..!

మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ముగిసిపోయిందని… బీసీసీఐ గట్టి సంకేతాలు పంపింది. ప్రతీ ఏటా.. ఆటగాళ్లకు ఇచ్చే కాంట్రాక్టుల్లో ఈ సారి ధోనీ పేరు మిస్ అయింది. ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ కాంట్రాక్టులిస్తుంది. ఏ ప్లస్ , ఏ,బీ, సీ అనే కేటగిరీల్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ఏడాది పాటు నిలకడైన వేతనం ఇస్తుంది. ఏ ప్లస్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మాత్రమే చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి ఏడు కోట్లు చెల్లిస్తారు. గత ఏడాది ధోనీకి ఏ కేటగరిలో చోటు కల్పించారు. ఈ ఏడాది పూర్తిగా మర్చిపోయారు. ప్రపంచకప్ సెమీఫైనల్లో..న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ధోనీ మళ్లీ ఇంత వరకూ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.

అయితే ఐపీఎల్ ఆడారు. మళ్లీ ఎప్పుడు మ్యాచ్ లు ఆడతారో.. క్లారిటీ లేదు. అలాగని రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. టెస్టులకు ఎప్పుడో గుడ్ బై చెప్పారు. త్వరలో వన్డేలనూ వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో.. కాంట్రాక్టుల జాబితా నుంచి ధోనీని తప్పించినట్లుగా తెలుస్తోంది. నిజానికి బీసీసీఐలో కొద్ది రోజులుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సౌరవ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత తనదైన ముద్ర వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో… టీం ఎంపిక ఉండాలన్న అభిప్రాయంతో.. గంగూలీ ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలో.. ఆయన ధోనీ ఎంపీక … పూర్తిగా ఇప్పుడు చూపిన ప్రతిభ ఆధారంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో.. ధోనీ ఇక టీ ట్వంటీలకు పరిమితం కావడమో..లేదా… వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చే ఆలోచనను బీసీసీఐ కల్పించడమో చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ధోనీ ఇప్పటికి చాలా సార్లు రిటైర్ అవబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ.. అది ఇప్పుడు ముంచుకొచ్చేసినట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close