ఏప్రిల్ ఫూల్ : ఈఎమ్‌ఐ వాయిదా వేసుకుంటే వడ్డీ బాదుడే..!

లాక్ డౌన్ కారణంగాహోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్.. ఇలా అన్నిరకాల లోన్లపై ఈఎమ్‌ఐలు మూడు నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే.. అందులో ఉన్న డొల్ల ఏమిటో.. మెల్లగా ఒకటో తేదీ వచ్చే సరికి బయటపడింది. యాధృచ్చికంగా అది ఏప్రిల్ ఒకటి కావడం.. మరింత విశేషం. బ్యాంకులు ఈఎమ్‌ఐ వసూలును నిలిపివేయడం లేదు. రిక్వెస్ట్ పెట్టుకున్న వారివి మాత్రమే వసూలు నిలిపివేస్తాయి. అలా రిక్వెస్ట్ పెట్టుకుంటే… ” టర్మ్స్ అండ్ కండిషన్స్”ని అంగీకరించినట్లే. ఈ ” టర్మ్స్ అండ్ కండిషన్స్”లో ముఖ్యమైనదే. వాయిదా వేసిన మొత్తానికి వడ్డీ కట్టేందుకు .. అంగీకరించడం. అంటే.. ఈ మూడు ఈఎమ్‌ఐల మీద వడ్డీ చెల్లించడానికి సిద్ధపడటం.

మూడు నెలలు ఈఎమ్‌ఐ కట్టలేమని.. బ్యాంకుకు అప్లయ్ చేసుకుంటే… వడ్డీ బారీగా పడుతుంది. ఉదాహరణకు.. 9.5 శాతం వడ్డీకి 20 లక్షల గృహరుణం ఉందనుకుందాం. దానిపై మూడు నెలలు ఈఎమ్‌ఐ మారటోరియానికి ధరఖాస్తు చేసుకుంటే… మూడు నెలలకు దాదాపుగా రూ. అరవై వేలు ఈఎమ్‌ఐ కట్టాల్సిన పని ఉండదు. కానీ ఈ మొత్తం రుణానికి యాడ్ అవుతుంది. ఈఎమ్‌లో అసలు, వడ్డీ కలిపి.. రుణానికి కలిపేసి.. మళ్లీ దాని మీద.. వడ్డీ వేస్తారు. అంటే.. కట్టాల్సిన నెలల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. మూడు నెలల ఈఎమ్‌ఐ వాయిదా వేసుకున్నందున.. అది … ఆరు నెలల నుంచి పది నెలల వరకూ కట్టాల్సిన గడువు పెరుగుతుంది. ఒక వేళ ఈ నెలలు పెరగకుండా ఉండాలంటే.. మూడు నెలల తర్వాత ఈఎమ్‌ఐ పెంచుకోవాలి. ఎలా చూసినా.. మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే… రుణ గ్రహీతలకు భారమే కానీ.. లాభం నయాపైసా ఉండదు.

ఆర్బీఐ మారటోరియాన్ని ఊరటగా ప్రకటించినప్పటికీ వాస్తవంలో మాత్రం.. బాదుడే. మారటోరియాన్ని అన్ని విధాలుగా ఆలోచించి ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మారటోరియం ఎంచుకుంటే భారమే కాబట్టి రుణగ్రహీతలు తప్పనిసరి అనుకుంటేనే ఆర్బీఐ ఇచ్చిన ఆప్షన్ ఎంచుకోవాలి. నెలవారీ ఆదాయాలు రాని పక్షంలో, వేతనాలు నిలిచిపోతే, అత్యంత కష్టంగా ఉంటే మాత్రమే మారటోరియం ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close