పెళ్లిళ్లు చేసుకోవ‌ద్దంటున్న పూరి

పూరి జ‌గ‌న్నాథ్ ఆలోచ‌న‌లు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. ఒక్కోసారి గురువు రాంగోపాల్ వ‌ర్మ‌ని `మించి`పోతుంటాడు. త‌న లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. క‌రోనా త‌ర‌వాత తన దైన స్టైల్‌లో వీడియోలు పోస్ట్ చేశాడు. మాన‌వ‌జాతికి సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఓ స‌రికొత్త స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మ‌నుషులంతా పెళ్లిళ్లు చేసుకోవ‌డం మానేయాల‌న్న స‌ల‌హా అందించాడు.

ఈ భూమికి ప‌ట్టిన వైర‌స్ మ‌నిషే అని, జ‌నాభా ఎక్క‌డికక్క‌డ పెరుగుతూ పోతోంద‌ని, మ‌నిషి త‌ప్ప మ‌రో జీవికి ఈ భూమ్మీద చోటు లేకుండా చేస్తున్నామ‌ని, పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఆపేసి, జ‌నాభా త‌గ్గించుకోవాల‌ని, త‌ద్వారా మ‌రో జంతువుకీ ఈ భూమ్మీద జీవించే అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించాడు. ప్ర‌పంచ దేశాల‌న్నీ జ‌నాభాని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని, సంతానోత్ప‌త్తి ఆపేయాల‌ని, లేదంటే జంతువులన్నీ అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించాడు. ప్రపంచంలో పెట్రోలు, డీజీలూ ఆపేసే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని, కొన్ని దేశాలు ఇప్ప‌టికే 2022 త‌ర‌వాత పెట్రోలు, డీజిలుతో న‌డిపే వాహ‌నాలు వాడొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పేశాయ‌ని గుర్తు చేశాడు పూరి. ఈ క‌ర్ఫ్యూని ఎదిరించి బ‌య‌ట‌కు తిరిగేసేవాళ్లంతా ఓ విష‌యం గుర్తించుకోవాల‌ని, క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే మ‌రో రెండేళ్ల పాటు ఎక్కువ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సివ‌స్తుంద‌ని, ప్ర‌పంచ‌మంతా ఆర్థిక మాంధ్యాన్ని చూడ‌బోతోంద‌ని హెచ్చ‌రించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌స్తాయా?

క‌రోనా ముందు.. క‌రోనా త‌ర‌వాత‌..? - ప్ర‌స్తుతం ప్ర‌పంచం న‌డ‌వ‌డిక‌, మ‌నుషులు ఆలోచించే విధానం, బ‌తుకులు రెండు ర‌కాలుగా విడిపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మార్పులు అనివార్యం. సినిమా కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నింటికంటే...

HOT NEWS

[X] Close
[X] Close