నిధుల కొరత ఉండని ముహూర్తాలు కావాలి సార్‌!

అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల్లో చాలా రకాల భయాలున్నాయి… అనుమానాలున్నాయి.. ప్రపంచం నివ్వెరపోయే నగరాన్ని నిర్మించేస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా ఊదరగొట్టారు. పదేపదే ప్రకటనలు గుప్పించారు. ప్రజల్లో చాలా ఆశలు రేకెత్తించారు. సింగపూర్‌, చైనా, జపాన్‌ దేశాలన్నీ వెళ్లి వచ్చేశా… వాళ్లందరూ ఎప్పుడెప్పుడు మన దేశానికి వచ్చి రాజధాని కట్టేద్దామా? డబ్బు సంచులు రెడీగా పెట్టుకుని కూర్చున్నారు అనిపించే స్థాయిలో ఆయన బిల్డప్పులు ఇచ్చారు. కానీ.. ఇప్పుడు క్రమక్రమంగా ఆ మాటల్లోని డొల్లతనం బయటపడుతోంది. ప్రస్తుతం మొదలెట్టిన తాత్కాలిక సచివాలయ భవనాలు తప్ప.. ఆయన చెప్పిన 2018 గడువు నాటికి మరొక భవనం నిర్దిష్టమైన నిర్మాణం, ‘తాత్కాలిక’ అనే ట్యాగ్‌లైన్‌ లేని నిర్మాణం వస్తుందనే అబిప్రాయం ఎవ్వరికీ కలగడం లేదు.

అయితే ఒక్క విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ కిందనే ఒప్పుకోవాలి. అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి.. పనులు ఏం జరుగుతున్నాయో పరమాత్ముడి కెరుక! కానీ అక్కడ ఏదో జరిగిపోతున్నట్లుగా బాహ్యప్రపంచానికి ఒక కలర్‌ ఇవ్వడంలో మాత్రం.. అమరావతికి సంబంధించిన ‘పీఆర్‌’ టీం చాలా చక్కగా పనిచేస్తోంది. అక్కడ ఏదో జరిగిపోతున్నదనే ఫీలింగ్‌ సృష్టించేలా… అక్కడ వాస్తు దిక్కులు ఎలా ఉండబోతున్నాయో.. ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, మండలి ఛైర్మన్‌ ఏదిక్కులను ఫేస్‌ చేసి కూర్చునేలా.. నిర్మాణాలలో వాస్తు మార్పులు చేయిస్తున్నారో.. వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి వార్తలు చూస్తున్నప్పుడు ఒక రకంగా ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. చంద్రబాబునాయుడుకు నికార్సుగా ముహూర్తాలు, వాస్తు మీద పట్టింపు ఉన్నట్లు అయితే.. అసలు నిధుల కొరత ఉండనివ్వని సుముహూర్తాన్ని పెట్టించి.. పనులకు శ్రీకారం చుట్టి ఉండాల్సింది. ఎన్నడో విజయదశమికి రెండవ శంకుస్థాపన కూడా జరిగినా.. ఉగాది దాకా.. ఒక్క ఇటుక కూడా నిజమైన నిర్మాణానికి కదలకపోవడం.. జనానికి సందేహాలు రేకెత్తించకుండా ఎలా ఉంటుంది. అందుకే జనం సీఎంను కోరుకుంటున్నది ఏంటంటే.. అయ్యా… నగర నిర్మాణం గురించి ప్రచారం రంజుగానే జరుగుతున్నది.. కానీ కుర్చీలు ఎటువైపు ఉండాలో వాస్తు లెక్కలు బాగానే వేయిస్తున్నారు గానీ… అసలు ఆ నిర్మాణాలు నిరాటంకంగా పూర్తయ్యేలా నిధుల కొరత ఉండని ముహూర్తాలూ పెట్టించండి స్వామీ అని విన్నవించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close