కాశ్మీర్ టు ఏపి అదే రాజకీయమా?

జాతీయత విషయంలో రాజీ ప్రసక్తిలేదని బిజెపి కార్యవర్గ సమావేశాల సందర్భంగా అద్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. జెఎన్‌యులోకి ప్రతిపక్ష నేతలు వెళ్లడం నేరమని ఆరోపించారు… కాని జమ్మూ కాశ్మీర్‌లో ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మడ్‌ సయ్యిద్‌ మరణించిన రెండు మాసాల తర్వాత కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడి ప్రధాన పక్షమైన పిడిపితో సహకరించకుండా రాజకీయ శూన్యాన్ని సృష్టించడం సరిహద్దు రాష్ట్రంలో పాలనారాహిత్యం దేశానికి క్షేమదాయకం కాదు. పిడిపితో గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాల అమలుకు హామీ నిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని మెహబూబా ముఫ్తి అడుగుతున్న దానికి కేంద్రం స్పందించడం లేదు.

అప్జల్‌ గురును ఆరాధించే ఆ పార్టీతో కలసి అధికారం పంచుకుంటే దేశం ముందు తమ జాతీయ రాజకీయ ప్రచారాలు సాగవని సంకోచిస్తున్నారనుకోవలసి వస్తున్నది. అలా అయితే గతంలో కలసి చేసిన పాలన చేసిన వాస్తవం మాసిపోదు కదా. సమస్య ఏమంటే బిజెపి నేతలు ముఫ్తీ మహ్మద్ మరణం తర్వాత ఆయన కూతురును బలపర్చడానికి కొన్ని షరతులు విధించి రాజకీయం చేయొచ్చని ఆశించారు.

కాశ్మీరీ గుర్తింపును నొక్కి చెప్పడం, కొన్నిసార్లు వేర్పాటువాద నినాదాలను కూడా బలపర్చిన చరిత్ర పిడిపికి ఉంది. దీంతో బిజెపి తరహా జాతీయవాద ప్రచారం బొత్తిగా సరిపడదు. కనుక ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని తెగతెంపులు చేసుకుంటే పోతుందనే భావన ఆ పార్టీ నాయకులు కొందరిలో వుంది. అద్యక్షుడు అమిత్‌షాను కలిసినప్పుడు అంతా బావుందని చెప్పిన మెహబూమా ప్రధాని మోడీని కలిసిన తర్వాత అసంతృప్తితో తిరిగివచ్చేసారు. బిజెపి తమకు ఇచ్చిన వాగ్డానాలు నిలబెట్టుకోలేదని ఆ పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు.

ఎన్నికల ముందు ప్యాకేజీలు ప్రకటించి తర్వాత చేతులు ఎత్తేయడం మోడీకి మామూలైపోయింది. బీహార్‌ ఎన్నికల ముందు ఆయన మాటలు విన్నవారు మొన్నటి పర్యటనలో వాటి వూసే ఎత్తులేదేమని ఆశ్చర్య పోయారు. ఇదే కాశ్మీర్‌ లోనూ పునరావృతమవొచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు మట్టి తీసుకొచ్చి దిగ్బ్రాంతి కలిగించడమే గాక ఇప్పటికి దానిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పడం లేదు. కనుకనే ఈ ప్రభుత్వానికి రాష్ట్రాల పట్ట బాధ్యతాయుత స్పందన లేదని భావించవలసి వస్తుంది. అయితే అంత కీలకమైన కాశ్మీర్‌ వంటి చోట్ల కూడా స్వప్రయోజనాల చదరంగం మంచిది కాదు. ఇలా అయితే జాతీయత అన్న మాటకు అర్థమే ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close