బీజేపీ రథయాత్రలో జనసేనకు చోటు లేదా..!?

రామ రథయాత్ర పేరుతో … రామతీర్థం నుంచి ఆలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించాలని బీజేపీ నిర్ణయించుకుంది. కానీ జనసేనను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మళ్లీ రగడ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.   ఏపీలో రాజకీయంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకున్నా…జనసేనతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్న ఓ కట్టుబాటు పొత్తు సమయంలోనే పెట్టుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్… మొదట్లో తాను ప్రకటించిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీల పేరుతో కాలయాపన జరిగింది కానీ…ఉమ్మడి కార్యాచరణ లేకుండా పోయింది.

ఇప్పుడు మళ్లీ రెండు పార్టీలు రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికైతే విడివిడిగా.. ఎవరి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. జనసేనపై సవారీ చేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ప్రారంభించింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని చెప్పేలా కార్యచరణ ఖరారు చేసుకుంటోంది. ఇప్పటికే జనసైనికులు.. తమ పార్టీని బీజేపీ వ్యూహం ప్రకారం నిర్వీర్యం చేస్తోందన్న అనుమానంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ క్రేజ్ ను వాడుకుంటూ బీజీపీ రాజకీయం చేస్తూ.. ఆయన పార్టీని మాత్రం పట్టించుకోవడం లేదన్న అసహనంలో ఉన్నారు. దీనిపై పై స్థాయి నేతలు కూడా..  బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే.. రథయాత్ర విషయంలో జనసేనను కూడా భాగస్వామిని చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ కారణంగానే ఓ కమిటీని జనసేన ప్రకటించినట్లుగా తెలుస్తోంది.  అయితే.. రథయాత్ర అని కాకుండా.. రామతీర్థం విషయంలో.. బీజేపీతో కలిసి పోరాడేందుకు.. జనసేన అధినేత కమిటీని ఏర్పాటుచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ ఉంటుందని… రామతీర్థం ఘటనలో కేసులో సత్వర న్యాయం కోసం బీజేపీతో కలిసి కమిటీ పనిచేస్తుందని పవన్ చెబుతున్నారు. ఈ కమిటీ ఎలా సమన్వయం చేసుకుని బీజేపీ చేస్తున్న రథయాత్రలో ఎక్కువ మార్కులు జనసేనకు వచ్చేలా చేసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిర్వాసితుల క‌న్నీటికి స‌మాధానం ఉందా…? బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై వైర‌ల‌వుతోన్న పోస్ట్!

మా క‌న్నీటికి నీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? మ‌మ్మ‌ల్ని ముంచి నువ్వు తెచ్చుకున్న సీటులో గెల‌వ‌గ‌ల‌వా...? బ‌త‌కొచ్చినంత మాత్రాన నువ్వు లోక‌ల్ ఎట్లా అయిత‌వ్...? ఇలాంటి ప‌దునైన మాట‌ల‌తో మెద‌క్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి,...

హైదరాబాద్‌లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సహజం... కానీ తెలంగాణ పోలీసులు ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయాలని నిర్ణియంచుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు...

మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకును వెంటాడుతున్న హిట్ అండ్ ర‌న్ కేసులు

బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసులో తవ్విన‌కొద్దీ నిజాలు బ‌య‌ట‌కొస్తూనే ఉన్నాయి. ఓ కేసులో తీగ‌లాగితే గ‌తంలో జ‌రిగిన కేసుల్లో త‌ను త‌ప్పించుకున్న తీరు బ‌య‌ట‌కు...

2024 బాక్సాఫీస్ : సెకండాఫ్ పైనే ఆశ‌లు

ఈ యేడాది అప్పుడే నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. కీల‌క‌మైన వేస‌వి సీజ‌న్ స‌గానికి వ‌చ్చేశాం. సంక్రాంతిలో మిన‌హాయిస్తే స్టార్ హీరోల సినిమాలేం బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ వేస‌వి చాలా చ‌ప్ప‌గా, నీర‌సంగా,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close