హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఎల్జీ పాలిమర్స్.. అయినా నో రిలీఫ్..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ .. ఎక్కడైనా రిలీఫ్ దొరుకుతుందేమోనని.. తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పటికిప్పుడు సంస్థను సీజ్ చేయడం ప్రమాదకరం అని వాదించి.. పరిమితంగా ముఫ్పై మంది సంస్థలోకి వెళ్లేలా అనుమతి తెచ్చుకున్నారు. అయితే.. సీజ్ చేయమని ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా ఎల్జీ పాలిమర్స్ సంస్థ …హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని స్పష్టం చేసింది.

ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్‌ చేయాలని.. హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని తమ వాదన వినిపించుకోలేదని.. కంపెనీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థపై ఇప్పటికే ఏడు రకాల విచారణ కమిటీలు విచారణ జరుపుతున్నాయని తాము ఎవరి ముందు అని హాజరు కావాలన్నారు. కంపెనీని ఇప్పటికిప్పుడు సీజ్ చేస్తే.. అందులో ఉన్న రసాయనాల వల్ల ప్రమాదం అని వాదించడం వల్ల.. కాస్త రిలీఫ్ లభించినట్లుగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ పై ఎన్జీటీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు కూడా.. పలు రకాల ప్రశ్నలను సంధిస్తూ.. నోటీసులు జారీ చేసింది.

అలాగే కంపెనీని సీజ్ చేయమని ఆదేశించింది. నిజానికి అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా ముందుగా కంపెనీని సీజ్ చేస్తారు. ఎల్జీ పాలిమర్స్ కు మాత్రం.. అలాంటి కష్టం ఎదురు కాలేదు. దర్జాగా చరాస్థి అయిన పాలిస్టైరిన్ ను తరలించేశారు కూడా. ఈ తరుణంలో.. ఆ సంస్థ.. విచారణ కమిటీలను ఎదుర్కోకుండా.. సుప్రీంకోర్టు పిటిషన్లతో ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం.. విచారణలపై ఎలాంటి స్టే ఇవ్వకుండా.. ఎలాంటి వాదనలైనా ఎన్జీటీ… హైకోర్టు ముందు చెప్పుకోవాలని స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close