రాజ్ త‌రుణ్‌కి పారితోషికం లేదు

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు రాజ్ త‌రుణ్‌. ఏ సినిమా ముట్టుకుంటే అది ఫ్లాపై కూర్చోంటోంది. మ‌రోవైపు యువ హీరోలంతా జోరుగా దూసుకెళ్లిపోతున్నారు. కొత్త కొత్త క‌థ‌ల‌తో హిట్లు కొడుతున్నారు. కానీ రాజ్ త‌రుణ్ కెరీర్ మాత్రం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు త‌యారైంది. ఈ దశ‌లో రాజ్ త‌రుణ్‌కి ఓ ఆఫ‌ర్ ద‌క్క‌డ‌మే గ‌గ‌నం అయిపోతోంది. అయితే దిల్‌రాజు పిలిచి మ‌రీ ఛాన్సిచ్చాడు. ‘ఇద్ద‌రి లోకం ఒక్క‌టే’ సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ఇదో ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ ల‌వ్ జ‌ర్నీ. స్క్రిప్టు చాలా బాగా వ‌చ్చింద‌ట‌. పైగా దిల్ రాజు బ్యాన‌ర్‌. ప‌బ్లిసిటీ విష‌యంలో ఢోకా ఉండ‌దు. సినిమాని స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేస్తారుకూడా. అందుకే.. ఈ సినిమాపై రాజ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.

అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ సినిమాకి గానూ రాజ్ త‌రుణ్‌కి పారితోషికం అంద‌డం లేదట‌. దిల్ రాజు కేవ‌లం ఖ‌ర్చుల‌కే డ‌బ్బులు ఇస్తున్నాడ‌ట‌. కొత్త హీరోలు, ద‌ర్శ‌కుల‌తో దిల్ రాజు సినిమా తీస్తుంటే, రెమ్యున‌రేష‌న్ సిస్ట‌మ్ అంతా వేరుగా ఉంటుంది. బ‌ల్క్‌గా ఆయ‌న పారితోషికాలు ఇవ్వ‌రు. నెల‌కు ఇంత అంటూ అందిస్తారు. ఈసారి కూడా దిల్‌రాజు అదే చేస్తున్నాడ‌ట‌. ఇలాంటి క్లిష్ట‌మైన త‌రుణంలో రాజ్‌త‌రుణ్‌కి సినిమా ఛాన్స్ ద‌క్క‌డ‌మే గ‌గ‌నం. పైగా దిల్ రాజు సినిమా. అందుకే పారితోషికం లేక‌పోయినా ఈ హీరో స‌ర్దుకుపోతున్నాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com