సాక్షి కథనాల్లో “కరెంట్” ఏది..? కామెడీ తప్ప..!

ఏపీలో ఏదో జరిగిపోతోందని.. చెప్పి.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి సాక్షి చేస్తున్న ప్రయత్నాలు ” కే ఏ పాల్” ఏ మాత్రం.. తడబడకుండా.. మొహంలో ఏ మాత్రం కామెడీ చాయలు లేకుండా.. అత్యంత సీరియస్‌గా కాబోయే సీఎంను నేనే అని చెప్పినట్లుగా ఉంటున్నాయి. ఏదో ఒకటి రాసి.. ఓహో అలా జరుగుతుందా.. అని అనిపించేందుకు పడుతున్న తాపత్రయం.. రోజూ… వెల్లడవుతూనే ఉంది. ఈ రోజు.. కరెంట్ విషయంలో… సాక్షి పత్రికలో అచ్చేసిన ఆ కథనం… ” వ్యతిరేకతతో కళ్లు మూతపడితే..” అన్నీ అలాగే కనిపిస్తాయన్నట్లుగా అనిపించడం ఖాయం.

“నాకు 2104కి ముందు రూ. 90 కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ. 350 వస్తోంది. సంపాదనలో అత్యధిక భాగం కరెంట్ బిల్లుకే పోతోంది..” అనేది సాక్షి పత్రికలో ఓ యువకుడి ఆవేదన. కరెంట్ ఎంత వాడుకుంటే.. అంత బిల్లు వస్తుందనేది అందరికీ తెలుసు. మరి సంపాదనలో అధికమొత్తం కరెంట్‌ బిల్లలకు పోవడం ఏమిటి…? అది కూడా రూ. 350 బిల్లు కట్టి..?.. అలాగే శ్రీకాంత్ అనే మరో యువకుడికి గతంలో రూ.200 వచ్చేదట.. ఇప్పుడు 7 నుంచి 8వందలు వస్తోందట. ఆయన ఇంట్లో రెండు ఫ్యాన్లు, టీవీ, మిక్సీలు ఉన్నాయట. ఆయన ఫోటో పేపర్లో అచ్చేసిందేమో.. కారులో దిగిన సెల్ఫీ ఫోటో. పోనీ గతంలో వచ్చిన బిల్లు … ఇప్పుడు బిల్లు చూపిస్తే ప్రజలు నమ్మేవారు కదా..!

… ఇలా.. ఏదో రాసుకోవాలి కాబట్టి రాయడానికి వినియోగదారుల పేరుతో.. కొంత మంది అభిప్రాయాలు ప్రచురించడమే కాదు… కరెంట్ వినియోగంపై.. సాక్షి చెప్పే లెక్కలు కూడా విచిత్రంగా ఉన్నాయి.

సామాన్యుడు వాడే కరెంట్‌పై ఓ గ్రాఫ్ వేశారు. అచ్చంగా అది సాక్షి రేంజ్‌లోనే ఉంది. సామాన్యుడు అంటే ఎవరు..? … సాక్షి పత్రిక చెప్పే లెక్కల్లో 395 కరెంట్ యూనిట్లు కాల్చే వాళ్లు సామాన్యులు. ఏకంబా బల్బులకు 120 యూనిట్లు కాల్చేవాళ్లు సామాన్యులు. అదేదో కచ్చితమైన లెక్క చెబుతునట్లుగా… రోజుకు పది గంటలు వేసుకుంటనే అంటూ పక్కనసూచన. అంటే ఎక్కువ సేపు వేస్తే ఎక్కువ కరెంట్ కాలుతుందట. ఇక టీవీ , ఇస్త్రీ పెట్టే, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మిక్సీ, వాటర్ హీటర్, రెండు ఫ్యాన్స్ ఇలా.. వరస అన్నీ ఉండి.. అన్నింటినీ గరిష్టంగా వాడుకున్న వారే సామాన్యుడు. వీటిలోనూ హీటర్‌కు నెలకు 45 యూనిట్లు కాలుతుందట. ఇలా చెప్పుకుంటే.. అతిశయోక్తులతో.. షాక్ తగలదు కానీ.. మంచి కామెడీ రాశారని అనుకోవడం ఖాయం. పాపం.. సాక్షి రచయిత ఎవరో కానీ.. ఏసీ గురించి మర్చిపోయారు. అంతకు మించి.. సెల్ ఫోన్ గురించి మర్చిపోయారు. జగన్ అసెంబ్లీలో.. సెల్ ఫోన్ చార్జింగ్‌కు నెలకు అరవై యూనిట్లు ఖర్చు అవుతుందని… కరెంట్ కనిపెట్టిన మేధావిలా చెప్పిన విషయం మర్చిపోయినట్లున్నారు. దాన్ని మర్చిపోయారు. అది కూడా కలుపుకుంటే.. సామాన్యుడి విద్యుత్ సగటు ఖర్చు నెలకు 450 యూనిట్లు కావొచ్చేమో..?

ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా సరే.. పెంచకపోయినా… విద్యుత్ బిల్లులు పెరిగాయని.. ప్రభుత్వం దోచేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం అంది. నిజంగా ప్రభుత్వం ఏమైనా చేస్తే.. చెప్పుకోవచ్చు కానీ.. ఇలా వాడుకున్న కరెంట్ బిల్లులు కూడా ఏదో ఎక్కువొస్తున్నాయని చెప్పి.. దానికి వింత వివిథ గ్రాఫిక్స్ జోడించి.. సామాన్యుల పేర్లతో.. ధనవంతుల ఫోటోలు వేసి… ఎందుకిలాంటి కథనాలు రాయడం. పత్రిక అనే దానికి ఉన్న విలువను తగ్గించడం..! . సామాన్యుని కరెంట్ వినియోగం .. ఏపీలో నెలకు 450 యూనిట్లు ఉందటంటే… ఆంధ్రప్రేదశ్‌లో సామాన్యుల జీవన ప్రమాణాలు చాలా పెద్ద స్థాయిలో మెరుగుపడినట్లే. మరి ఈ కోణంలో… సాక్షి పత్రిక ఎందుకు ఆలోచించలేదో..ఎడిటోరియల్ టీమ్.. ఈ స్టోరీని ఎలా పాస్ చేసిందో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close