భూమనకూ జగన్ టిక్కెట్ ఇవ్వడం లేదట..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి టిక్కెట్ ఎవరిది అంటే… అందరూ ఒకే మాట చెబుతారు.. భూమన కరుణాకర్ రెడ్డిది అని. అక్కడ్నుంచి ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవి రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. అంతకు ముందు చిరంజీవిపై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఓడిపోయారు. తిరుపతికి రెండేళ్ల పాటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. వైఎస్ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఆయన తిరుపతిలో చక్రం తిప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. వ్యవహారం మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. సాక్షి పత్రిక యూనిట్ ఆఫీసులో కూడా ఆయనదే పెత్తనం. తిరుపతి సాక్షి పత్రికలో ఏమి రావాలో.. ఆయనే చెబుతారని అక్కడి మీడియా వర్గాలు చెబుతూ ఉంటాయి. ఓ రకంగా ఆయన నాన్ వర్కింగ్ ఎడిటర్ అన్నమాట. అంతగా.. పార్టీ, సాక్షి పై పట్టు సాధిచిన భూమనకు.. ఇప్పుడు జగన్ టిక్కెట్ ఇవ్వడం లేదట..!

సామాజికవర్గాల సమీకరణాలు చూస్తే.. తిరుపతిలో రెడ్డి అభ్యర్థి విజయం సాధించడం అంత తేలిక కాదు. ఓ వేవ్ రావాలి. ఉపఎన్నికల్లో.. భూమన కరుణాకర్ రెడ్డి గెలిచినప్పుడు… అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకే గెలవగలిగారు. అక్కడ బలిజ వర్గానికే ఎక్కువగా రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇస్తూ ఉంటాయి. అందుకే జగన్ కూడా.. ఓ బలమైన బలిజ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ తరపున.. మాజీ ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ భార్య సుగుణ ఉన్నారు. ఈ సారి టిక్కెట్ ఆమెకే ఖరారు చేయబోతున్నారు. అందుకే పోటీగా మహిళా అభ్యర్థినే బరిలోకి దించాలనే ఆలోచన చేస్తున్న జగన్.. ప్రముఖ సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ భార్య పేరును పరిశీలిస్తున్నారట. ఎన్వీ ప్రసాద్ గతంలో టీడీపీ తరపున పోటీ చేశారు. తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. కొంత కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని తానేనంటూ ప్రకటించుకొని కరుణాకర్ రెడ్డి ప్రచారం చేసుకుంంటున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ.. బంధువులుగా కూడా మారిన కరుణాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా.. .ఉండరని..అందరూ అనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా సామాజిక సమీకరణాల కోసం.. టిక్కెట్ నిరాకరించే పరిస్థితి రావడమే.. భూమన వర్గీయులను.. ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ.. జగన్ ఎంతో మంది సీనియర్లను పక్కన పెట్టేశారు. ఆ నిర్ణయాల ప్రకారం చూస్తే.. భూమనకూ టిక్కెట్ లేనట్లేనని.. వైసీపీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close