ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళలో 250మంది మరణానికి కారకుడయిన యాకుబ్ మీమన్ కి ఉరి శిక్ష ఖరారు కాగానే దేశంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మొదలు అసదుద్దీన్ వరకు అందరూ తెగ బాధపడిపోతున్నారు. అది మనిషికి కాదు మానవత్వానికి వేస్తున్న ఉరి త్రాడు అని కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ ఈరోజు ఉదయం పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు పోలీసులను, ఇద్దరు హోంగార్డులను కాల్చి చంపినా ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. యాకుబ్ ప్రాణం గురించి, అతనిపైనే ఆధారపడిన కుటుంబం గురించి ఆలోచించి తాను అతని ఉరి శిక్షను ఆపమని కోరుతున్నానని సల్మాన్ ఖాన్ ట్వీట్ మెసేజ్ పెట్టారు. మరిప్పుడు 9మంది పోలీసులు ప్రాణాల గురించి, వారిపైనే ఆధారపడిన కుటుంబాల గురించి ఎందుకు మెసేజులు పెట్టడం లేదు? వారి ప్రాణాలు ఉగ్రవాది యాకుబ్ ప్రాణాలంత విలువయినవి కావా? లేకపోతే ఉగ్రవాదులకొక రూలు సామాన్య ప్రజలకు మరొక రూలని వారు అందరూ భావిస్తున్నారా?