బాల‌య్య చివ‌రికి అంజ‌లితోనా..?

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈపాటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లెట్టేస్తారు. ఈలోగా క‌థానాయిక ఎంపిక ప్ర‌క్రియ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న క‌థానాయిక‌గా అంజ‌లిని ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇది వ‌ర‌కు `డిక్టేట‌ర్‌`లో బాల‌య్య‌తో అంజ‌లి జోడీ క‌ట్టింది. ఇప్పుడు రెండోసారి వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నార‌న్న‌మాట‌.

నిజానికి బాల‌య్య కోసం క్రేజీ హీరోయిన్ల‌నే వెద‌కాల‌నుకున్నాడు బోయ‌పాటి. ఓ ద‌శ‌లో కీర్తి సురేష్ పేరు బ‌లంగా వినిపించింది. ఆమెతో చిత్ర‌బృందం సంప్ర‌దింపులు కూడా జ‌రిపింది. కానీ కుద‌ర్లేదు. ఆ త‌ర‌వాత శ్రియ పేరు కూడా ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. ఇండ్ర‌స్ట్రీలోని టాప్ హీరోయిన్లంద‌రి ద‌గ్గ‌ర‌కూ ఈ ఆఫ‌ర్ వెళ్లొచ్చేసింది. చివ‌రికి అంజ‌లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగింది. ఈ సినిమాలో అంజ‌లితో పాటు మ‌రో క‌థానాయిక ఉంటుందా? లేదంటే అంజ‌లి మాత్ర‌మే క‌థానాయికా అనేది తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com