నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ఇచ్చే గౌర‌వం అదీ!

నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియ‌ర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండ‌డానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వ‌చ్చేశామంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు. కొంత‌మంది నిర్మాత‌ల‌కు ద‌ర్శ‌కులు క‌థ కూడా చెప్ప‌రు. హీరోలు విలువే ఇవ్వ‌రు. అయితే.. ఆ కాలంలో ఇలా లేదు. నిర్మాతే అన్నీ! సినిమాని ధ‌నం, మూలం, స‌ర్వం అన్నీ నిర్మాతే. హీరోలు సైతం వాళ్ల‌కు ఇచ్చే విలువ ఆ రేంజులో ఉండేది.

వైజ‌యంతీ మూవీస్ ప్ర‌యాణం, ప్ర‌స్థానం, సాధించిన విజ‌యాలు.. వీటిలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో కీల‌కం. వైజ‌యంతీ మూవీస్‌కి నామ‌క‌ర‌ణం చేసింది కూడా ఆ పెద్దాయ‌నే. ఎన్టీఆర్‌తో `ఎదురు లేని మ‌నిషి` తీస్తున్న‌ప్పుడు అశ్వ‌నీద‌త్ వ‌య‌సు 24 ఏళ్లు మాత్ర‌మే. కానీ ఓ రోజు అశ్వ‌నీద‌త్ సెట్ కి వెళ్తే.. కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ అమాంతం లేచి, అశ్వ‌నీద‌త్‌ని ఆహ్వానించారు. ఆ ప‌రిణామానికి అశ్వ‌నీద‌త్ షాక్‌కి గుర‌య్యారు. ”అదేంటి సార్‌… న‌న్ను చూసి మీరు లేచి రావ‌డం” అంటూ ఆశ్చ‌ర్య‌పోతే… ”ఈ సినిమాకి నిర్మాత మీరు, అంద‌రికీ అన్నం పెట్టేది మీరు. మీ వ‌ల్లే మాకు ప‌ని దొరికింది. అలాంటి మీకు గౌర‌వం ఇవ్వాల్సిందే. సెట్లో నేనే మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోక‌పోతే.. ఎవ‌రు ప‌ట్టించుకుంటారు” అంటూ ఎద‌రు ప్ర‌శ్నించారు ఎన్టీఆర్‌. అదీ.. నిర్మాత‌ల ప‌ట్ల ఆయ‌న‌కున్న గౌర‌వ భావం.

ఈ విష‌యాన్ని ఈ రోజు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా వైజ‌యంతీ మూవీస్ త‌న ట్విట్ట‌ర్‌లో గుర్తు చేసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close