ఇద్ద‌రు వ‌ర్మ‌ల్లో.. ఫ‌స్టు ఎవ‌రు?

క‌రోనాపై సినిమా తీసేశాన‌ని ప్ర‌క‌టించాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆ సినిమా టీజ‌ర్‌కూడా విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వ‌ర్మ ప‌నుల‌న్నీ ఇలానే ఉంటాయి. గ‌ప్‌చుప్‌గా సినిమా లాగించేయ‌గ‌ల‌డు. ఈసారీ అదే ప‌ని చేశాడు. అయితే ఈలోగా క‌రోనాపై మ‌రో సినిమా త‌యార‌వుతోంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. `అ`తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. రేపు… అంటే శుక్ర‌వారం ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ కూడా విడుద‌ల అవుతోంది. నిజానికి వ‌ర్మ కంటే క‌రోనాపై సినిమా మొద‌లెట్టింది ప్ర‌శాంత్ వ‌ర్మ‌నే. క‌రోనా ప్ర‌భావం మ‌న దేశంలో అంత‌గా లేక మునుపే ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ రాసుకుని షూటింగ్ కూడా మొద‌లెట్టాడ‌ట‌. లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌క‌మునుపే దాదాపు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ‌ర్మ సినిమా షూటింగ్ మొద‌లెట్టాడు కాబ‌ట్టి. క‌రోనాపై మొట్ట మొద‌టగా ఓసినిమాని ప్రారంభించిన ఘ‌న‌త ప్ర‌శాంత్ వ‌ర్మ‌కే క‌ట్ట‌బెట్టాలి. అయితే.. ఈ రెండు సినిమాల్లో ఎవ‌రి సినిమా ముందు బ‌య‌ట‌కు వ‌స్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా - బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు...

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

HOT NEWS

[X] Close
[X] Close