”ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా బాధలు, సంతోషాలు అన్నీ పంచుకున్నారు. జీవితాంతం మిమ్మల్ని ఆనందింపజేయడానికి శ్రమిస్తా. ఈ జీవితం మీకే అంకింతం. భవిష్యత్తులోనూ మనమందరం కలిసి ముందుకెళ్దాం” అన్నారు ఎన్టీఆర్. హృతిక్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడారు.
‘‘‘వార్ 2’ చేయడానికి ముఖ్య కారణం… ‘నువ్వు ఈ సినిమా చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా’ అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. ఆయన మాట వినకుండా, నమ్మకుండా ఉండి ఉంటే, మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదు. దర్శకుడు అయాన్ ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. అందరూ గర్వపడే సినిమా ఇచ్చాడు.
”25 సంవత్సరాల క్రితం ‘కహో నా ప్యార్ హై’లో హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో ‘హృతిక్ రోషన్’ ఒకరు. హృతిక్ రోషన్ ఈస్ ది గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం. హృతిక్ రోషన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనలో నన్ను చాలాసార్లు చూసుకున్నాను. 75 రోజుల వర్కింగ్ డేస్‌లో ఆయన ఎన్నో విషయాలు నాకు నేర్పారు. ఆయనతో మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. ఇది ఎన్టీఆర్ హిందీకి వెళ్లి చేస్తున్న సినిమానే కాదు, హృతిక్ రోషన్ తెలుగులోకి వచ్చి చేస్తున్న సినిమా కూడా. తప్పకుండా హృతిక్ రోషన్ గారిని తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకుంటారు. ఇది నా ప్రామిస్.
‘‘రామోజీ రావు గారు తన బ్యానర్లో నన్ను పరిచయం చేశారు. మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి నా పక్కన నాన్నగారు, అమ్మ తప్ప ఎవరూ లేరు. మొదటిసారి నన్ను కలిసి అభిమాని మూజీబ్. అలా మొదలైన జర్నీలో ఇప్పుడు ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం. మీ ప్రేమను పెంచుతూ వెళ్లారే తప్ప తగ్గలేదు. నాన్న హరికృష్ణ గారికి, అమ్మ షాలినిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సినిమా షూటింగ్స్‌తో నేను తీరిక లేకుండా ఉంటే ఇంటిలో ఉండి అన్ని చూసుకుంటున్న నా భార్య ప్రణతితో పాటు మా అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్‌కి ప్రేమతో నా హగ్స్. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు.
‘వార్ 2’ బొమ్మ అదిరిపోయింది. సినిమాలో ట్విస్ట్‌లు ఉన్నాయి. దయచేసి బయట పెట్టకండి. ఎంజాయ్ చేయండి. ఇది హిందీ మూవీనే కాదు.. తెలుగు సినిమా కూడా. డబుల్ కాలర్ ఎగరేశాను. కుమ్మేద్దాం.
ఈ వేడుకలో ఎన్టీఆర్ డబుల్ కాలర్ ఎగరేయడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్‌ని చూసి హృతిక్ కూడా కాలర్ ఎగరేశారు. ఇది ఫ్యాన్స్‌కి డబుల్ కిక్ ఇచ్చింది.