అఫీషియ‌ల్‌: ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ 2 భాగాలు

అనుకున్న‌దే అయ్యింది. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ 2 భాగాలుగా రాబోతోంది. `కథానాయ‌కుడు` పార్ట్ 1గానూ, `రాజ‌కీయ నాయ‌కుడు` పార్ట్ 2గానూ విడుద‌ల చేస్తారు. `క‌థానాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న విడుద‌ల అయితే, `రాజ‌కీయ నాయ‌కుడు` జ‌న‌వ‌రి 16న విడుద‌ల చేస్తారు. నిజానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ ని రెండు భాగాలుగా చేయాల‌న్న ఆలోచ‌న లేనే లేదు. కానీ ఎప్పుడైతే స్క్రిప్టులో కూర్చున్నారో, అప్పుడు సీన్లు అలా వ‌స్తూనే ఉన్నాయ‌ట‌. విష్ణు ఇందూరి తీసుకొచ్చిన క‌థ‌ని బుర్రా సాయిమాధ‌వ్‌, క్రిష్ క‌ల‌సి ఆ క‌థ‌ని డెవ‌లెప్ చేసుకుంటూ వేళ్తే 164 సీన్ల వ‌ర‌కూ వ‌చ్చాయ‌ట‌. నిజానికి ఓ సినిమాకి 60 నుంచి 70 సీన్లు స‌రిపోతాయి. ఏ స‌న్నివేశాన్నీ ప‌క్క‌న పెట్టాల‌నిపించ‌క‌పోవ‌డంతో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని రెండు భాగాలుగా మార్చేద్దామ‌ని ఫిక్స‌య్యారు. దాన్ని ఇప్పుడు అధికారికంగా ప్ర‌క‌టించేశారు. ఎన్టీఆర్ జ‌న‌నం నుంచి, య‌వ్వ‌న ద‌శ‌, క‌థానాయ‌కుడిగా మారిన వైనం, ఎదుగుద‌ల, స్టార్ డ‌మ్‌, చేసిన గొప్ప పాత్ర‌లూ ఇవ‌న్నీ `క‌థానాయ‌కుడు`లో చూస్తాం. అశేష జ‌న‌వాహిని స‌మ‌క్షంలో త‌న పార్టీ పేరుని `తెలుగుదేశం` అని ప్ర‌క‌టించడంతో తొలిభాగం ముగుస్తుంది. రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగిన వైనాన్ని ద్వితీయార్థంలో చూపిస్తారు. ఎన్టీఆర్ అంతిమ‌యాత్ర‌తో ఈ క‌థ ముగుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close