ఎన్టీఆర్ అభిమానులు డైలామా తీరింది. ‘దేవర 2’ ఉంటుందా, లేదా? అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ‘దేవర 2’ ఉంది. మే నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ‘దేవర’ నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని ప్రకటించారు. నందిగామలో జరిగిన ఓ ఈవెంట్ లో ‘దేవర 2’ ఉంటుందా, లేదా?` అనే ప్రశ్న నిర్మాతకు ఎదురైంది. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ‘దేవర 2′ తప్పకుండా ఉంటుంది. మే నుంచి షూటింగ్ మొదలెడతాం. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’ అని అభిమానుల సాక్షిగా ప్రకటించారు. ప్రస్తుతం ‘డ్రాగన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. మే నుంచి దేవరకు కొన్ని డేట్లు కేటాయించే అవకాశం ఉంది.
‘దేవర 2’ గురించిన సస్పెన్స్ ముందు నుంచీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఉందని కొంత కాలం, లేదు.. ఎన్టీఆర్ పక్కన పెట్టేశారు అని కొంత కాలం వార్తలొచ్చాయి. మధ్యలో కొరటాల శివ వేరే కథ రాసుకొని, హీరోల వెంట తిరిగాడు. పవన్ కల్యాణ్‌కి కూడా ఓ కథ చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్టులేం వర్కవుట్ కాలేదు. అయితే ఇటీవల మళ్లీ ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. ఇద్దరి మధ్యా కథకు సంబంధించిన చర్చలు జరిగాయి. అది ‘దేవర 2’ కోసమా, లేదంటే కొత్త కథ కోసమా? అనే మీమాంశ నెలకొంది. మొత్తానికి ఇప్పుడు అది ‘దేవర 2’ కోసమే అని తేలిపోయిది. ‘డ్రాగన్’ ముగిసిన వెంటనే కొరటాల సినిమా ఫిక్స్ అయినట్టు అనుకోవొచ్చు. మరి త్రివిక్రమ్ – ఎన్టీఆర్‌ల కాంబో ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందో?
