తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న తొంభై శాతం మంది నటులు ఒక విషయంలో మాత్రం ఒకేలా బిహేవ్ చేస్తూ ఉంటారు. మొదట్లో అవకాశాలు లేనప్పుడు, స్టార్ ఢం లేనప్పుడు మాత్రం అందరూ కూడా డైరెక్టర్స్‌కి వంగి వంగి సలాములు చేస్తూ ఉంటారు. డైరెక్టర్ ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఒకసారి స్టార్ఢం వచ్చాక మాత్రం అదే డైరెక్టర్స్‌కి చుక్కలు చూపిస్తూ ఉంటారు. సీన్స్, డైలాగ్స్, యాక్టింగ్‌తో సహా అన్ని విషయాల్లోనూ కాళ్ళూ, వేళ్ళూ పెట్టేస్తూ ఉంటారు. స్టార్ హీరోస్ కూడా ఇందుకు అతీతమేం కాదు. ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు మాత్రం డైరెక్టర్స్‌కి ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తారు. ఓ రెండు హిట్స్ పడగానే వాళ్ళ జడ్జ్మెంట్ స్కిల్స్ పైన విపరీతమైన నమ్మకం పెంచేసుకుంటారు. ప్రేక్షకులు, అభిమానుల పల్స్ మాకు తెలిసిపోయాయన్న భ్రమల్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత నుంచీ అన్ని వ్యవహారాల్లోనూ తమ టాలెంట్ చూపించాలన్న అత్యుత్సాహంతో షాడో డైరెక్షన్ కూడా చేసేస్తూ ఉంటారు.
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ కూడా ఇప్పుడు కథల విషయంలో అలానే ఆలోచిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కథ బాగుందా? లేదా? అనే విషయం గురించి ఆలోచించడం కంటే కూడా తను చెప్పాలనుకున్న విషయాలు, తనకు నచ్చిన అంశాలను ఆ కథలలో ఇరికించడం ఎలా అన్న ఆలోచనలతోనే నిర్ణయం తీసుకోవాలన్న ప్రయత్నంలో ఎన్టీఆర్ ఉన్నాడట. జనతా గ్యారేజ్ కంటే పెద్ద హిట్ కొట్టాలన్న టార్గెట్ ఉండడంలో తప్పు లేదు కానీ ఇలా డైరెక్టర్స్ పనులలో వేలెట్టాలన్న ప్రయత్నాలు మాత్రం చివరికి ఎన్టీఆర్ కెరీర్‌కి నష్టమే చేస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కథలు, క్యారెక్టర్స్ ఎలా ఉండాలో హీరోలు చెప్పడం స్టార్ట్ చేస్తే అన్నీ ఒకే రకమైన సినిమాలు, క్యారెక్టర్స్ చేసుకోవాల్సి వస్తుందని ఆ మధ్య ఓ సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెప్పాడు. తనలో ఉన్న దర్శకత్వ, రచనా నైపుణ్యాలను కాస్త కంట్రోల్ చేసి డైరెక్టర్స్ తీసుకొస్తున్న బెస్ట్ కథల్లో ఓ కథను సెలక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఎన్టీఆర్‌కి సలహాలు ఇస్తున్నారు. హీరోల జడ్జ్మెంట్, రచనా సామర్ధ్యం అంతా కూడా ఓ మంచి కథను సెలక్ట్ చేసుకునే విషయంలో చూపిస్తే సరిపోతుందని…….అలా కాకుండా కథ, కథనం, డైరెక్షన్లలో వేళ్ళు పెట్టడం స్టార్ట్ చేస్తే లాంగ్ రన్లో మాత్రం వాళ్ళ కెరీర్‌కి వాళ్ళే నష్టం చేసుకున్నవాళ్ళు అవుతారని విమర్శకులతో పాటు కొంతమంది డైరెక్టర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.