టీజ‌ర్ టాక్ : జై ల‌వ‌కుశ‌

స్టార్లు వేరు..న‌టులు వేరు! స్టార్‌లోనూ ఓ న‌టుడు ఉండే అది నిజంగా గొప్ప విష‌య‌మే. ఈ ల‌క్ష‌ణం పుణికిపుచ్చుకొన్న క‌థానాయ‌కుడు ఎన్టీఆర్‌. వీలైన‌ప్పుడ‌ల్లా త‌న‌లోని న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసుకొస్తూనే ఉన్నాడు. అలా తీసుకొచ్చిన‌ప్పుడ‌ల్లా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తూనే ఉన్నాడు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రిభిన‌యం చేస్తున్న చిత్రం ‘జై ల‌వ‌కుశ‌’. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. ‘జై’ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ సాగిన ఈ టీజ‌ర్ నిడివి 30 సెకెన్లలే. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఒక్క‌టే. కానీ.. అందులోనే త‌న విశ్వ‌రూపం చూపించేశాడు ఎన్టీఆర్‌. ”ఆ రావ‌ణుడ్ని చంపాలంటే స‌ముద్రం దాటాలా.. ఈ రావ‌ణుడ్ని చంపాలంటే స‌ముద్ర‌మంత‌. థై…… ర్య‌ముండాలా.. ఉందా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ – ఈ టీజ‌ర్‌ని మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన ఆర్‌. ఆర్‌… ఓ యాక్ష‌న్ షాట్‌… సింహాస‌నంపై కూర్చున్న ఎన్టీఆర్ విక‌ట‌ట్ట‌హాసం… మొత్తం క‌లిపి ‘జై ల‌వ‌కుశ‌’పై న‌మ్మ‌కాన్ని ఒక్క‌సారిగా రెట్టింపు చేశాయి. ‘జై’ పాత్ర త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది, ఎన్టీఆర్‌ని మ‌రో కోణంలో చూపిస్తుంద‌న్న విష‌యం ఈ టీజ‌ర్ తో రూఢీ అయిపోయింది. ఇక ల‌వ కుశ‌లు ఎలా ఉంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.