‘న‌క్ష‌త్రం’ ఆడియో ఫంక్ష‌న్ లో సాయిధ‌ర‌మ్ తేజ్‌ ఫ్యాన్స్ అల్లరి

స్టార్ హీరోల ఆడియో ఫంక్ష‌న్లు ర‌చ్చ ర‌చ్చ‌లా త‌యార‌వుతున్నాయి. ఎందుకంటే స‌ద‌రు హీరో ఫ్యాన్స్ అరుపులు కేక‌ల‌తో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లిపోతుంటోంది. ఎవ‌రు మాట్లాడ‌దామ‌నుకొన్నా… మాట్లాడ‌నివ్వ‌కుండా చేస్తుంటారు. ”మా హీరోనే మాట్లాడాలి.. మా హీరో గురించే మాట్లాడాలి” అనే ఇటెన్ష‌న్ వాళ్ల‌ది. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌తో ఈ పేచీ ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. ‘ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్‌’ అంటూ వాళ్లు చేసే గోల‌కు హ‌ద్దుండ‌దు. అందుకే అల్లు అర్జున్ లాంటి హీరో కూడా `చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌` అంటూ త‌న అస‌హ‌నం వ్య‌క్త ప‌ర‌చాల్సివ‌చ్చింది. అయితే… స‌రిగ్గా ఇదే సీన్ ‘న‌క్ష‌త్రం’ ఆడియో ఫంక్ష‌న్ లో రిపీట్ అయ్యింది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ని చూసి మెగా ఫ్యాన్స్ అరుపులూ.. కేరింత‌ల‌తో అద‌ర‌గొట్టేశారు. ఎవ‌రు మాట్లాడ‌డానికి మైకు తీసుకొన్నా… గోల గోల చేశారు. ‘తేజూ.. తేజూ’ అంటూ గోల గోల చేశారు. సందీప్ కిష‌న్ మాట‌ల‌కూ అడ్డు త‌గిలారు. ఈ ద‌శ‌లో కృష్ణ‌వంశీ మైకు తీసుకొని.. ”తేజూ.. తీసుకొచ్చిన ఫ్యాన్సా??” అంటూ సెటైర్ కూడా వేశాడు. ఈ కేక‌ల‌తో ఆడియో ఫంక్ష‌న్ ర‌సాభస‌గా మారింది. చివ‌ర్లో కృష్ణ‌వంశీ ఈ సినిమా గురించి ఏం మాట్లాడ‌కుండానే.. రెండు ముక్క‌ల‌తో స‌రిపెట్టేశాడు. తేజూకి నిజంగా ఇంత ఫాలోయింగ్ వచ్చేసిందా? లేదంటే ఈ ఫ్యాన్స్‌ని ఎరువు తెచ్చుకొన్న బాప‌తా?? అనే విష‌యంలో అక్క‌డివాళ్లంతా సెటైర్లు వేసుకోవ‌డం విశేషం. నిజంగా తేజూకి ఇంత ఫాలోయింగ్ ఉంటే.. ‘సుప్రీమ్ హీరో’ అనే బిరుదుకి నిజంగా అర్హుడే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.