ఫిబ్రవరి 10 నుంచి ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ లో బిజీ బిజీ!

ఎన్టీఆర్‌, సుకుమార్‌ల లేటెస్ట్‌ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్‌ అవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విషయంలో ఎన్టీఆర్‌ చాలా హ్యాపీగా వున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసి ఆ గెటప్‌ నుంచి బయట పడ్డ ఎన్టీఆర్‌ రిలాక్స్‌ అవకుండా వెంటనే తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ షూటింగ్‌కి రెడీ అవుతున్నాడు. ‘శ్రీమంతుడు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ చేస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 10న ప్రారంభం కాబోతోంది. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘జనతా గ్యారేజ్‌’ నిర్మాణం జరుపుకోనుంది. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఒక భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నారు. ఆ తర్వాతి షెడ్యూల్‌ ఎక్కడ చెయ్యాలన్నది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు.

ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సరసన నటించే హీరోయిన్‌ అన్వేషిస్తున్నాడు డైరెక్టర్‌ కొరటాల శివ. ఇప్పటి వరకు కొంతమంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఇంకా ఎవ్వరినీ ఫైనల్‌ చెయ్యలేదు. ఈ సినిమాలో ఒక కొత్త హీరోయిన్‌ని తీసుకునే ఆలోచనలో కొరటాల వున్నట్టు తెలుస్తోంది. రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యేలోపు హీరోయిన్‌ని కూడా ఫైనల్‌ చేస్తారట. ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారట. ఆగస్ట్‌ 12న మూడు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com