మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్‌లో… ‘మ‌హానాయ‌కుడు’ ప్రీమియ‌ర్ షో

సాధార‌ణంగా బాల‌కృష్ణ సినిమా అంటే.. విడుద‌ల రోజున ఉద‌యం 5 గంట‌ల‌కు స్పెష‌ల్ షో త‌ప్ప‌కుండా ప‌డిపోతుంటుంది. గ‌త మూడు నాలుగు సినిమాల నుంచీ ఇదే సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. క‌థానాయ‌కుడు ప్రీమియ‌ర్ విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఇప్పుడు మ‌హానాయ‌కుడుకి మాత్రం ఒక రోజు ముందే షో ప‌డిపోతోంది. ఈనెల 22న మ‌హానాయ‌కుడు విడుద‌ల అవుతోంది. అయితే గురువార‌మే హైద‌రాబాద్‌లో ప్రీమియ‌ర్ షో ఫిక్స‌య్యింది. గురువారం రాత్రి 6.30 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌లో ప్రీమియ‌ర్ షో ఏర్పాటు చేశారు. సినీ తార‌లు, మీడియా కోసం ఈ షో ప్ర‌త్యేకం. `క‌థానాయ‌కుడు` ప్రీమియ‌ర్ షో కూడా ఏఎంబీలోనే వేశారు. కాక‌పోతే..అది విడుద‌ల రోజున ఉద‌యం 10 గంట‌ల షో. ఈసారి మాత్రం ఓ రోజు ముందుగానే `మ‌హానాయ‌కుడు`ని చూడొచ్చు. బాల‌య్య‌కు ముహూర్తాల‌పై న‌మ్మ‌కం ఎక్కువ‌. శుక్ర‌వారం తెల్ల‌వారుఝామున కంటే.. గురువారం రాత్రే ముహూర్తం బాగుంద‌ట‌. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. `మ‌హానాయ‌కుడు` జాత‌క‌మేంట‌న్న‌ది గురువారం రాత్రే డిసైడ్ అయిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close