ఊపిరి చేయాల్సింది ఎన్టీఆర్ అట

తెలుగు సిని పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సారి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు బైలింగ్వల్ మూవీతో రాబోతున్నారు కింగ్ నాగార్జున, కార్తి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి బ్యానర్లో వీరు చేస్తున్న సినిమా ‘ఊపిరి’. హాలీవుడ్ ‘ఇన్ టచబుల్స్’ సినిమా అధికారికంగా రీమేక్ అవుతున్న ఈ సినిమాలో నాగ్, కార్తిలు స్నేహితులుగా నటిస్తున్నారు.

అయితే ముందు ఈ సినిమాలో కార్తి పాత్రకు ఎన్టీఆర్ ను అనుకున్నాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. అనుకోవడమే కాదు సినిమా కథ, కథనాలను కూడా ఎన్టీఆర్ తో కలిసి చర్చించాడట కూడా. అంతా నచ్చింది సినిమాకు ఓకే అనే చెప్పే సందర్భంలో వేరే సినిమా డేట్స్ అడ్జెస్ట్ చేయాల్సి రాగా ఊపిరి సినిమాను వదులుకున్నాడట తారక్. సినిమాలో నటించకపోయినా ఊపిరి కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం తను నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సందర్భంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘ఊపిరి’ సినిమా మిస్ అయిన సందర్భాన్ని గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు యంగ్ టైగర్. ఏమాట కామాట కాని ఊపిరి సినిమా ఎన్టీఆర్, నాగార్జున కలిసి చేస్తే అదే ట్రెండ్ సెట్ సినిమాగా చరిత్రలో మిగిలిపోయి ఉండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close