అడ‌గొద్దంటూనే అప్ డేట్ ఇచ్చిన ఎన్టీఆర్‌

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. కొర‌టాల సినిమా ఓకే అయినా దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. కొర‌టాల శివ‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ విష‌యం ఎన్టీఆర్‌లోనూ అస‌హ‌నాన్ని ర‌గిలిస్తోంది. అది `అమిగోస్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట‌ల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ల్యాణ్ రామ్ న‌టించిన కొత్త సినిమా `అమిగోస్`. ఈనెల 10న వ‌స్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడాడు. అప్ డేట్ గురించి ఒత్తిడి తీసుకురావొద్ద‌ని, ఏమైనా ఉంటే తామే చెబుతామ‌ని, త‌న భార్య కంటే ముందు త‌న సినిమా అప్ డేట్ అభిమానుల‌కు ఇస్తాన‌ని ఎన్టీఆర్ మాటిచ్చాడు. “అభిమానులు అడిగిన‌ప్పుడల్లా అప్‌డేట్‌లు ఇవ్వ‌డం కుద‌ర‌దు. వారి ఆరాటం వ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. అప్‌డేట్ ఇవ్వాలి క‌దా అని ఏదోటి చెప్పేయ‌డం కుద‌ర‌దు. మంచి అప్ డేట్ ఉంటేనే చెబుతాం“ అని అభిమానుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ఎన్టీఆర్‌. ప‌నిలో ప‌నిగా… త‌న కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశాడు. ఈనెల‌లోనే కొర‌టాల సినిమా మొద‌ల‌వుతుంద‌ని, మార్చిలో సెట్స్‌పైకి వెళ్తుంద‌ని, 2024 ఏప్రిల్ లో సినిమాని విడుద‌ల చేస్తామ‌ని అభిమానుల స‌మ‌క్షంలో ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్‌. సో.. కొర‌టాల సినిమాకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

అమరావతిపై మళ్లీ సుప్రీంలో విచారణ జూలైలోనే !

అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఆరు నెలల సమయం తీసుకుని తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రాత్రికి రాత్రి విచారణ జరిపించేసుకోవాలని తాపత్రయ పడుతున్న జగన్‌కు ఏదీ కలసి రావడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close