తెలుగు మీడియాలో జగన్ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తమ విధేయతను ఎలా చూపాలో తెలియక అడ్డదిడ్డంగా చూపిస్తూ తెలివితేటలు చూపిస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీవీ చేస్తున్న ప్రయత్నాలు ఔరా అనిపిస్తున్నాయి.
దోచుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తే.. మీరు దోచుకోలేదా అని బురద చల్లేస్తుది వైసీపీ. అంతే కానీ మేము దోచుకోలేదని చెప్పరు. ఎందుకంటే ప్రజల దృష్టిలో తాము.. టీడీపీ ఒకటేనని.. అందరం దోచుకుంటామని జనరలైజ్ చేయడానికి ఆ వ్యూహం. టీడీపీ నేతలు దోచుకుంటారో లేదో కానీ.. వైసీపీ సానుభూతి మీడియాలో మాత్రం కళ్ల కథలుగా చెబుతారు. ఆ ప్రచారం ఎలా ఉంటుందంటే.. కాస్త ఆత్మాభిమానంతో ఉంటే.. కోడెల శివప్రసాద్ లా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తారు. ఇదే వైసీపీ రాజకీయ వ్యూహాన్ని ఎన్టీవీ తన ఎడిటోరియల్ పాలసీగా మార్చుకుంది.
కొద్ది రోజుల నుంచి కూటమి ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై అదే పనిగా దోపిడీ అంటూ రుద్దుతోంది. ఇసుక అని.. మట్టి అని.. నోటికి వచ్చిన రంగంలో దోపిడీ జరిగిపోతోందని గగ్గోలు పెడుతోంది. అయితే ఇక్కడే ఎన్టీవీ అసలు వ్యూహం బయటపడుతోంది. ఏంటంటే.. వైసీపీ నేతలతో కుమ్మక్కయిపోయి దోపిడీ చేస్తున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగిందట.. ఇప్పుడూ అదే జరుగుతోందట. కూటమి ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల వారీగా టార్గెట్ చేసి మరీ ఇలాంటి స్టోరీలు అల్లేస్తున్నారు. ఒక్క స్టోరీలోనూ నిర్దిష్టమైన ఆరోపణలు ఉండవు. చిన్న ఆధారం చూపించరు. వైసీపీ , టీడీపీ ఒకటే అని చెప్పడానికే ఈ తాపత్రయం.
ఏడాది నుంచే ఎన్టీవీ ఇలా ప్రారంభించడానికి టీవీ9కి.. ఎన్టీవీకి వైసీపీ తరపున ఎడిటోరియల్ అడ్వయిజర్ గా వ్యవహరించే సజ్జల ఉంటారని చెప్పాల్సిన పని లేదు. ఇలా రద్దుడు ప్రారంభిస్తే.. మెల్లగా తర్వాత ఎటాక్ పెంచవచ్చని వారి ప్లాన్. ఇలాంటి అడ్డగోలు ఆరోపణలపై చర్యలు తీసుకోకపోతే నిజమనుకునేలా నమ్మించడానికి ముఠాలను తర్వాత రంగంలోకి దింపుతారు.