చంద్రబాబు ఎలా పని చేయాలో చెప్పే వారిలో .. ఆయన శ్రేయోభిలాషులుగా చెలామణి అయ్యేవారే కాదు.. జగన్ రెడ్డి వ్యాపారభాగస్వాములు, మీడియా భాగస్వాములు కూడా ఉన్నారు. చైర్మన్స్ డెస్క్ పేరుతో ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ ప్రతీ వారం ఓ కథనాన్ని వండిస్తారు. తానేదో పండిపోయిన జర్నలిస్టునని అనిపించుకోవాలన్నట్లుగా మేధావులతో ఆ కథనం తన ఆలోచనల మేరకు రాయిస్తారేమో కానీ ఆయన గురించి తెలిసిన వారు మాత్రం నవ్వుకుంటారు.
ఆర్కే అలా రాశాడు కాబట్టి.. తాను కూడా రాయాలని అనుకున్నారో.. లేకపోతే చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో సలహాలిస్తున్నారని అనుకున్నారో కానీ ఓ అరగంట కథనం రాసిపడేశారు. అందులో బోలెడన్ని సలహాలతో పాటు బురద కూడా ఉది. మరి ఇలాంటి ధైర్యం జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు ?
జగన్ రెడ్డి కోసం .. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విపక్షాలపై ఎన్టీవీ చేయని అఘాయిత్యం లేదు. నారా లోకేష్ అనే లీడర్ ఫోటో లేదా పేరు కూడా వినిపించకుండా ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కార్యక్రమాలు ఎప్పుడో అంతా అయిపోయాక.. ఎవరూ పట్టించుకోనప్పుడు ఇచ్చామని అనిపించుకునేవారు. ప్రతిపక్షాలకు కనీస వాయిస్ కూడా ఇచ్చేవారు కాదు. కానీ తప్పుడు ప్రచారం, కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి తన చానల్ ను నిర్విరామంగా వాడేస్తూ ఉంటారు. జగన్ రెడ్డికి ఊదిన బాకాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ అదే అజెండా. ప్రతి ఒక్కరి మీద బురద చల్లేయడమే పని.
అసెంబ్లీకి ఎందుకు వెళ్లవు … ప్రజలంటే లెక్క లేదా.. ప్రజాస్వామ్యం అంటే తెలియదా.. అని ఒక్క సారి అడగరు. వివేకా హత్యకేసు గురించి చెప్పరు. తల్లి, చెల్లి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చూపించలేరు. జగన్ రెడ్డి పరిపాలన చేస్తున్నప్పుడు.. ఇలా కాదు అలా అని ఒక్క సలహా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎగేసుకు వస్తున్నారు. ప్రభుత్వం ఎలా నడపాలో సలహాలిస్తున్నారు.