అధికారులే పట్టించకోని నీతి ఆయోగ్! కేంద్రానికీ రాష్ట్రాలకూ ఆర్ధిక మధ్యవర్తి ఎవరు?

నరేంద్రమోదీ ప్రభుత్వం ప్లానింగ్ కమీషన్ ను రద్దు చేశాక జాతీయ ఆర్థిక విధానం గురించి రాషా్ట్రలకు అభిప్రాయాలను వెల్లడించే వేదిక దాదాపుగా లేకుండాపోయింది. ఆర్ధికవిషయాలలో కేంద్రానికీ రాషా్ట్రనికీ మధ్యవర్తి వ్యవస్ధే లేకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా ఏర్పడిన నీతీఅయోగ్ పాలకమండలి , సీనియర్ అధికారులు ఖాతరు చేయనంత బలహీనంగా వుంది. దీంతో రాషా్ట్రలకు అవసరమైన, అందవలసిన ఆర్ధిక సహాయం ఇపుడు కేవలం కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ విచక్షణ, దయాదాక్షిణ్యాలమీదే ఆధారపడి వుంటుంది.

రాష్ట్రాలకు అందవలసిన వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచాలనే 14వ ఆర్థిక సంఘం సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం వల్ల ఈ వాస్తవం మరుగున పడింది. దీంతో రాషా్ట్రల వాటా తగ్గకపోగా పెరిగిందనే భావం ఏర్పడింది. ఈ భావన సరికాదు.రాషా్ట్రలకు ఆర్థిక సంఘం ద్వారా బదిలీ అయ్యే నిధులు పెరిగినప్పటికీ అన్ని బదిలీలూ ఆర్థిక సంఘం ద్వారా జరగవు.

మూడు మార్గాల ద్వారా కేంద్రం నుంచి రాషా్ట్రలకు నిధులు బదిలీ అవుతాయి. మొదటిది, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జరిగేవి. రెండవది, ప్రణాళికా సహాయం. (ఇది గతంలో ప్రణాళికా సంఘం ద్వారా జరిగేది.) మూడవది, విచక్షణాధికారాలను ఉపయోగించి శాఖల ద్వారా అయ్యే బదిలీలు. ప్రస్తుతం ఆర్థిక సంఘం తన పరిధిలోని నిధుల విషయంలో రాష్ట్రాల వాటాను పెంచినప్పటికీ ఈ పెరుగుదలనే సాకుగా చూపి రాషా్ట్రలకు అందవలసిన ప్రణాళికా సహాయంలో కోత విధిస్తున్నది. దీనితో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులను పెంచినప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో కేంద్రం నుంచి రాషా్ట్రలకు జరిగే నిధుల బదిలీ శాతం బాగా తగ్గిపోయింది.

సెంటర్‌ ఫర్‌ బడ్జెట్‌ అండ్‌ గవర్నెన్స్‌ అకౌంటబిలిటీ(సిబిజిఎ)కి చెందిన సోనా మిత్ర లెక్కలననుసరించి స్థూల జాతీయోత్పత్తిలో కేంద్రం నుంచి రాషా్ట్రలకు బదిలీ అవుతున్న మొత్తం నిధుల శాతం కొంత కాలంగా క్రమేణా తగ్గిపోతున్నది. 2010-11లో 6.1 శాతంగా ఉన్న ఈ బదిలీలు ఆ తరువాత మూడు సంవత్సరాలలో 6.1 శాతం, 5.8 శాతం, 5.6 శాతంగా ఉన్నాయి. అయితే 2014-15 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల వాటా 6.1 శాతానికి పెరిగింది. 2015-16కు ఎన్‌డిఎ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంచనాలోనే రాష్ట్రాల వాటా 5.8 శాతానికి కుదించబడింది. గత సంవత్సరం బడ్జెట్‌లో పొందుపరిచిన 6.1 శాతం సవరించిన అంచనాలో 5.4 శాతానికి తగ్గించబడినట్లు, ఈ సంవత్సరం బడ్జెట్‌లో తక్కువగా కేటాయించిన 5.8 శాతం మరికొంత తగ్గించబడే అవకాశముంటుంది.

ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్‌ ప్రణాళికా వనరులను రాషా్ట్రలకు బదిలీ చేయదు. దానికి ఎలాంటి వనరులూ అందుబాటులో ఉండవు. ప్రభుత్వం కోసం ఏర్పాటైన ఒక ఇంటలెక్చువల్ సెంటర్ గా ఉంటుందని భావించారు. కానీ దీనికి ప్రస్తుతం ఆ పాత్ర కూడా లేదు. హోదాలను బట్టి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు, సభ్యులను అధికారులు లెక్కచేయటం లేదు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సెక్రటరీలు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు పిలిచే సమావే శాలకు హాజరుకావటానికి ఆసక్తి చూపటంలేదు. వారికి బదులుగా జూనియర్‌ అధికారులు ఈ సంస్థ సమావేశాలకు హాజరవు తున్నారు.

రాషా్ట్రలకు బదిలీఅయ్యే ప్రణాళికా నిధులను ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఇక్కడే కథంతా ఉన్నది. ప్రణాళికా సంఘం ఒకవిధంగా కేంద్ర ప్రభుత్వ శాఖ అయినప్పటికీ దాని సుదీర్ఘ చరిత్ర నుంచి ఎంతో కొంత స్వతంత్రంగా వ్యవహరించింది.కేంద్రానికి, రాషా్ట్రలకు మధ్య ఆర్ధిక విషయాల్లో మధ్యవర్తి పాత్రను నిర్వహించింది. తమ వార్షిక ప్రణాళికలను అంతిమంగా రూపొందించుకోవటానికి రాషా్ట్రలకు ప్రణాళికా సంఘంతో సమావేశమై విధాన సంబంధిత విషయాలను చర్చించేవి.

ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి)కి పంచవర్ష ప్రణాళికలను రూపొందించే అధికారం ఉండేది. ఈ మండలికి ప్రణాళికా సంఘం జవాబుదారీగా ఉండేది. ఎన్‌డిసి, ప్రణాళికా సంఘాల యంత్రాంగంలో రాషా్ట్రలకు సమిష్టిగానూ, విడివిడిగానూ కూడా ప్రధాన ఆర్థిక విధానాల గురించి అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఉండేది. లక్ష్యపెట్టినా, పెట్టకపోయినా ఈ అభిప్రాయాలను కేంద్రం వినవలసి వచ్చేది. ఈ యంత్రాంగాన్నంతా రద్దుచేసి రాషా్ట్రలకు ప్రణాళికా సాయాన్ని అందించే కర్తవ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగించటం వల్ల దేశ ఆర్థిక విధానాన్ని రూపొందించటంలో రాషా్ట్రలకు అభిప్రాయాలను నివేదించటానికి ఎలాంటి సంస్థాగత ఏర్పాటూ లేకుండా పోయింది.

కేంద్రంతో సంప్రదించటానికి వారికున్న ఏకైక మార్గం ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ శాఖను నిర్వహించే అధికార గణం ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో పనిచేసిన మాజీలు. వీరు రాషా్ట్రలకు అభిప్రాయాలకు విలువనివ్వరు. నీతి ఆయోగ్‌ పాలక మండలి(ఇది ఎన్‌డిసిని స్థానభ్రంశం చేయగలదు)లో రాషా్ట్రలకు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నందున ఆ సంస్థ సమావేశాలలో వీరి అభిప్రాయాలను తెలిపే అవకాశముంటుందని అనుకోవచ్చు. అయితే నీతి ఆయోగ్‌కే ప్రాధాన్యతలేనప్పుడు దాని పాలక మండలికి ఏమి విలువ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ...

బ్యారేజీలో బోట్లు తీయడం పెద్ద టాస్కే !

ప్రకాశం బ్యారేజీలో బోట్లు బయటకు రావడం లేదు, ఎంత మంది నిపుణులు వచ్చినా రోజుల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోజనం కలగలేదు....

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close