ఇది ఇండియాలోనే సాధ్యం!

చట్టాలను చేసే వారే వాటిని ఉల్లంఘిస్తారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ప్రజల నెత్తిమీద కూర్చొని ఊరేగాలని చూస్తారు. ప్రజా ధనాన్ని తాతగారి ఆస్తిలా ఖర్చు చేస్తారు. వీవీఐపీల పేరుతో చిల్లర వేషాలు వేస్తారు. బాధ్యతా రాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. ఎవరేమనుకుంటే మాకేంటి సిగ్గు అన్నట్టు ప్రవర్తిస్తారు. మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ప్రదర్శించే విన్యాసాలివి.

గత ఏడాది ఎంపీలుగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో సర్కారీ బంగళాలు ఇచ్చే వరకూ చాలా మంది ఎంపీలు ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. కొంత కాలానికి వరసగా ఒకరి తర్వాత ఒకరికి బంగళాలు కేటాయించారు. అయినా, సర్కారు బంగళాకంటే ఫైవ్ స్టార్ హోటలే మోడ్రన్ గా ఉంటుంది కదా. అందుకని చాలా మంది దాన్ని వదిలిపెట్టలేదు. అలాగని హోటల్ వాళ్లు బిల్లు వదిలిపెడతారా? అశోకా హోటల్ వారు గత ఏప్రిల్ వరకే 26 కోట్ల 70 లక్షల బిల్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ సొమ్మును చెల్లించింది అనేకంటే, ప్రజలమైన మనమే ఆ భారాన్ని భరించామనడం కరెక్ట్.

ఇక, నూరేళ్లకు పైబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉండటం అంటే అన్ని విషయాలపై అవగాహన, బాధ్యత ఉంటాయని అనుకుంటాం. అంబికా సోనీ, సెల్జా అనే ఇద్దరు మహిళా మాజీ మంత్రులు తమ చేష్టలతో హైకోర్టు తిట్లు తిన్నారు. జరిమానా శిక్షకు గురయ్యారు. పదవిలో ఉన్నప్పుడు విశాలమైన భవంతుల్లో వీరు దర్జాగా ఉన్నారు. ఇంకా వాటిలోనే ఉంటామని దబాయిస్తూ వచ్చారు. అది కుదరదని, టైప్ 7 బంగళాల్లోకి మారాల్సిందేనని కేంద్రం గట్టిగా చెప్పేసరికి, రాజకీయం గుర్తుకు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం కావాలని తమను వేధిస్తోందని ఆరోపించారు. అదేం మాట అని ఢిల్లీ హైకోర్టు ఇద్దరికీ తలంటింది. చెరో 25 వేల రూపాయల జరిమానా విధించింది.

ప్రజలకు సేవ చేస్తామని, దేశం కోసం పాటుపడతామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారు, చట్టాలను చేసేవారు మరి పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరు సరిగా ఉందా? ఒక్కరోజైనా సభ సాఫీగా జరుగుతుందనే గ్యారంటీ ఉందా? లేనేలేదని ముందే ప్రకటిస్తున్నారు. మా డిమాండును ఒప్పుకొనే వరకూ సభను జరగనిచ్చేది లేదని ముందే ప్రకటించి మరీ సభను స్తంభింప చేస్తున్నారు. మనం చెమటోడ్చి సంపాదించిన డబ్బులోంచి కొంత పన్నులుగా కట్టిన సొమ్మును ఎంత దారుణంగా బూడిదలో పోసిన పన్నీరుగా దుబారా చేస్తున్నారు? కానీ ఏం చెయ్యగలం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీమర్స్ కి మాంచి స్టఫ్ ఇచ్చిన ప్రభాస్

చిన్న సినిమాల టీజర్, ట్రైలర్స్ పెద్ద హీరోలు లాంచ్ చేసి ఎంతో కొంత ప్రమోషన్స్ లో భాగం కావడం కామన్. 'ట్రైలర్ బావుంది. అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయండి' అని తమవంతు...

టాలీవుడ్ జాత‌కం ఈ ముగ్గురు హీరోల చేతుల్లోనే!

ఈ యేడాది తెలుగు చిత్ర‌సీమది ఎగుడు దిగుడుల ప్ర‌యాణ‌మే. ఓ హిట్ వ‌స్తే... వ‌రుస‌గా ఓ డ‌జ‌ను ఫ్లాపులు ముసురుకుంటున్నాయి. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన సినిమాలు బోల్తా ప‌డుతున్నాయి. వేస‌వి సీజ‌న్‌ని చిత్ర‌సీమ...

పేదల పేరుతో హైడ్రాకు బ్రేకులు – పెద్ద స్కెచ్చే !

హైడ్రా కూల్చివేతల్ని పేదల పేరుతో అడ్డుకోవడంలో కొంత మంది సక్సెస్ అయ్యారు. హైడ్రా యాక్షన్ ప్రారంభించినప్పటి నుండి కొంత మందికి ఉక్కపోత ప్రారంభమయింది. అదే అదనుగా పేదల ఇళ్లు ఇంటూ...

రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ

రాజ్యసభలో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు 119 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో స్వయంగా బీజేపీకి 96...

HOT NEWS

css.php
[X] Close
[X] Close