అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అనుకుంటారో అలా ‘ఓజీ’ని తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు సుజిత్. దీనికి సాక్ష్యం.. ఓజీ టీజర్ గ్లింప్స్. పవన్ కళ్యాణ్ బర్త్ డే కి విడుదలైన ఈ టీజర్ మామూలుగా లేదు. ”ఇలా కదా పవన్ ని చూపించాల్సింది’ అని ఒక మార్క్ సెట్ చేసినట్లుగా గ్లింప్స్ ని డిజైన్ చేశారు. ఈ టీజర్ తో ఓజీ పై అంచనాలు ఒక్కసారిగా వందరెట్లు పెరిగాయి. ఐతే ఇదే సమయంలో ‘ఓజీ’ పవన్ తో సినిమాలు చేస్తున్న మిగతా దర్శకులపై ఒత్తిడి పెంచింది.
‘ఓజీ’ తో పాటు పవన్ హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై వున్నాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఈ రెండు సినిమాల నుంచి చెరో పోస్టర్ వదిలారు. ఐతే ఓజీ ముందు అవి తేలిపోయాయి. పవన్ ఫ్యాన్స్ కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి హరిహర దర్శకుడు క్రిష్.. బర్త్ డేకి ఒక గ్లింప్స్ ని రెడీ చేశాడు. ఓజీ టీజర్ హవా చూసిన తర్వాత ఇప్పుడు విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించారు. ప్రస్తుతం ఓజీ ముందు నిలబడాలంటే ఇంకా ఎదో పవర్ ఫుల్ కంటెంట్ కావాలి. పవన్ సినిమాలే ఓజీ ముందు నిలబడటానికి అలోచించే పరిస్థితి రావడం ఒక అరుదైన పరిస్థితే. మొత్తానికి మిగతా దర్శకులకు పెద్ద టాస్కే పెట్టాడు సుజిత్.