పవన్ కల్యాణ్ – సుజిత్ కాంబోలో `ఓజీ` రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. పవన్ ఇప్పుడు ‘ఓజీ’ని పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. సెప్టెంబరు 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్.
అయితే ఇప్పుడు ‘ఓజీ 2’ కూడా ఉండబోతోందన్న టాక్ నడుస్తోంది. క్లైమాక్స్ లో అందుకు హింట్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కానీ ‘ఓజీ 2’లో పవన్ కనిపించడని సమాచారం. ఓజీ 2లో పవన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఓజీని కూడా ఓ ఫ్రాంచైజీగా, ఓ వరల్డ్‌గా మార్చే ఆలోచనల్లో ఉన్నాడు సుజిత్. ఓజీలో కీలకమైన పాత్రలు చాలా ఉంటాయని, ఒకొక్క పాత్ర చుట్టూ ఓ కథ నడుస్తుంది, అలా.. ఒక్కో పాత్రతో ఒక్కో సినిమాని రూపొందించొచ్చని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ పాత్రకు ఓ గతం అంటూ ఉంటుంది. గతంలో ఏం జరిగింది? అనే పాయింట్ తో ప్రీక్వెల్ కూడా చేయొచ్చు. కాకపోతే.. ఈ ప్రీక్వెల్ పవన్ కోసమే సిద్ధం చేయాలి. ప్రస్తుతం పవన్‌కున్న కమిట్ మెంట్ల దృష్ట్యా ఆయన సినిమాల్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తరవాత సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. ‘ఓజీ 2’ పవన్ చేయకపోవొచ్చు. మరి ‘ఓజీ 2’లో కనిపించే హీరో ఎవరో తెలియాలంటే కొన్నాళ్లు ఎదురు చూడక తప్పదు.
`ఓజీ` తరవాత నానితో ఓ సినిమా చేయబోతున్నాడు సుజిత్. ఆ తరవాత రామ్ చరణ్ – సుజిత్ కలిసి పని చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. వీటిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.