అర్జున్‌రెడ్డికి అది ప్ల‌స్సే!

అర్జున్ రెడ్డి సూప‌ర్‌.. డూప‌ర్‌.. కేక అన్న‌వాళ్లు కూడా ‘ఈ సినిమా సెకండాఫ్ కాస్త విసిగించింది.. నిడివి ఎక్కువ‌’ అనేశారు. అదీ పాయింటే. ఈమ‌ధ్య కాలంలో మూడు గంట‌ల సినిమా చూళ్లేదు. సినిమాలో కంటెంట్ ఉంది కాబ‌ట్టి.. ఆ మూడు గంట‌ల సినిమానీ ఓపిగ్గా చూస్తున్నారు యూత్‌. అది చాల‌ద‌న్న‌ద‌ట్టు ఇప్పుడు కొత్త‌గా మ‌రో ప‌ది హేను నిమిషాలు పెంచేశారు. నిడివి ఎక్కువైంద‌న్న కార‌ణంతో ట్రిమ్ చేసిన ఆ స‌న్నివేశాల్ని ఇప్పుడు జోడించారు. అంటే అర్జున్ రెడ్డి సినిమా మూడు గంట‌ల ప‌దిహేను నిమిషాల‌న్న‌మాట‌. ఓ సారి సినిమా చూసి ఆ ప‌దిహేను నిమిషాల కోసం మ‌రో సారి వెళ్లిన వాళ్ల‌కు ఓకే. కొత్త‌గా ఈ సినిమా చూద్దాం అనుకొన్న వాళ్లు ఇంత నిడివి భ‌రించ‌గ‌ల‌రా?? ఓవైపు లెంగ్త్ మైన‌స్‌.. మైన‌స్ అంటుంటే – మ‌రోవైపు ఈ సినిమాని ఇంకాస్త సాగ‌దీయాల‌ని చూడ్డం నిజంగా అర్జున్ రెడ్డి టీమ్ చేస్తున్న సాహ‌స‌మే. ఆ ప‌దిహేను నిమిషాల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అని… యువ‌త‌రం మ‌రోసారి అర్జున్ రెడ్డి చూస్తార‌న్న న‌మ్మ‌కం.. చిత్ర‌బృందానిది. ఇప్ప‌టికే ఈ సినిమాపై లాభాలొచ్చేశాయ్‌. జ‌నం చూసినా, చూడ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. ప‌దిహేను నిమిషాలు జోడించినంత‌మాత్రాన హిట్ సినిమా ఫ్లాప్ అయిపోదు. పైగా రిపీటెడ్ ఆడియ‌న్స్ టికెట్స్ బాగా తెగుతాయి. అందుకే… 15 నిమిషాల స్ట‌ఫ్‌ని మ‌ళ్లీ త‌గిలిస్తున్నారు. ఈ జోరుతో ఇంకొన్ని రోజులు అర్జున్ రెడ్డి ద‌గ్గ‌ర జ‌నాలు క‌నిపించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close