‘వి’లో మ‌రో విల‌న్‌?

నాని – సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా రూపొందిన చిత్రం ‘వి’. క‌రోనా గొడ‌వ లేక‌పోతే.. ఈ పాటికి ఈ సినిమా విడుద‌ల‌య్యేది. కానీ… లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. లాక్ డౌన్ ఎత్తేస్తే… ముందుగా క్యూ క‌ట్టే సినిమాల్లో `వి` ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. నానిని తొలిసారి నెగిటీవ్ షేడ్‌లో చూపిస్తున్న సినిమా ఇది. మ‌రి నేచురల్ స్టార్ అయిన నాని… త‌న‌లోని విల‌నిజాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

అన్న‌ట్టు ఈ క‌థ‌లో విల‌న్ ల‌క్ష‌ణాలున్న మ‌రో పాత్ర కూడా ఉంద‌ట‌. క‌థానాయిక అతిథిరావు హైద‌రీ క్యారెక్ట‌రైజేష‌న్‌లో నెగిటీవ్ షేడ్స్ క‌నిపిస్తాయ‌ని, ఆమె పాత్ర ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతుంద‌ని టాక్‌. అతిథి ముందు నుంచీ కాస్త విభిన్న‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటోంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక పాత్ర‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇంద్ర‌గంటి త‌న పాత్ర‌ని డిజైన్ చేసిన విధానానికి అతిథిరావు మ‌రోసారి ఫిదా అయిపోయింద‌ని, నాని, సుధీర్ త‌ర‌వాత‌.. ప్రేక్ష‌కుల్ని త‌న వైపుకు తిప్పుకునే క్యారెక్ట‌ర్ అతిథిదే అని టాక్‌. త్వ‌ర‌లో విడుదల కాబోతున్న ఈ `వి`లో ఇంకెన్ని వింత‌లున్నాయో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close