వ్యాపారానికి వైరస్ : ఐటీ సిస్టమ్ స్లో..!

కోవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినే రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కూడా ఉంటుంది. ఓ రకంగా.. భారీ స్లంప్‌ను చూడబోయే రంగాల్లో ఇదే కీలకమన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఐటీ రంగం… జూమ్ ఇన్ అవడం ప్రారంభమయిన తర్వాత.. 2008లో మాత్రమే తీవ్రమైన మాంద్యాన్ని చూసింది. రాకెట్ వేగంతో అప్పటి వరకూ ఎదిగిన ఆ రంగం… ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులతో ఇబ్బందిపడింది. కానీ వెంటనే కోలుకుంది. ఆ తర్వాత ఎదురు లేకుండా ముందుకు సాగుతోంది. ఇలాంటి సమయంలో కోవిడ్ -19 గట్టి దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

“ఐటీ” సంస్థలకు 2008నాటి మాంద్యం గండం..!

కోవిడ్ -19 ఐటీ రంగంపై నెగిటివ్ ప్రభావం లేదా ఫ్లాట్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. 2008 కంటే పెద్ద సంక్షోభమేనని అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా కట్టడి కోసం దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇప్పటికే ప్రపంచాన్ని మాంద్యం మబ్బులు కమ్మేశాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు… వ్యాపార సంస్థలు ఐటీ మీద వెచ్చించే మొత్తాన్ని తగ్గించడానికే అవకాశం ఉంది. మాంద్యం ముంచుకు రావడం ఖాయమనే అంచనా ఉంది కాబట్టి… ఐటీ రంగంపై దేశాలు, సంస్థలు పెట్టే బడ్జెట్ ఎంత ఎక్కువ తగ్గితే అంత మేర… ఐటీ రంగానికి ఆదాయం పడిపోతుంది. అదే జరిగితే… తిరోగమనంలోకి ఇండస్ట్రీ వెళ్లిపోతుంది.

ఐటీపై పెట్టే ఖర్చును తగ్గించుకోనున్న సంస్థలు.. దేశాలు..!

ఈ క్రమంలో భారతీయ ఐటీ సంస్థల్లో ఇతరుల పెట్టుబడులు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఐటీ రంగ ఆదాయం గణనీయంగా పడిపోతుంది. ఐటీ కంపెనీల క్లయింట్లు ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఈ ఏడాదిలో ఖర్చులు తగ్గించుకోవం ఖాయంగా ఉంది. ఆదాయం తగ్గడం ఖాయమే సూచనలు రావడంతో.. భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే ముందు జాగ్రత్తలు ప్రారంభించాయి. కంపెనీల్ని కాపాడుకునేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల భారాన్ని దించుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే కొత్త నియామకాల కోసం ఇచ్చిన ఆఫర్ లెటర్లను హోల్డ్ లో పెట్టేశారు. దాదాపుగా ప్రతీ దేశంలోనూ లాక్‌డౌన్ ఉంది. ప్రస్తుతం బడా కంపెనీలన్నీ.. తమకు కోవిడ్ -19 కారణంగా ఏ మేరకు వ్యాపారం తగ్గుతుంది.. ఖర్చును ఎలా అదుపులో ఉంచాలనే అంశాలపై ప్లాన్ చేసుకుంటున్నాయి. వివిధ రంగాల్లో ఐటీ వ్యయం తగ్గుతుంది కాబట్టి.. సహజంగానే ఐటీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉటుంది.

ముందు జాగ్రత్తల్లో బడా కంపెనీలు..!

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో.. ఆయిల్, తయారీ రంగాలతో పాటు… సేవల రంగంలో.. ఐటీ అత్యంత కీలకంగా ఉంది. ఐటీ రంగం వృద్ధి చెందకపోతే… ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి మరింతగా దిగజారిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ రంగం వృద్ధి సంగతేమో కానీ.. బడా కంపెనీలు కూడా.. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడ కష్టమన్న అంచనాలు వస్తున్నాయి. ఇంకా చిన్నా చితకా కంపెనీలు.. ఉనికి పోరాటం చేయాల్సిందేనన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. 2008 సంక్షోభంలో కొన్ని లక్షల కంపెనీలు గల్లంతయ్యాయి. ఈ సారి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చెప్పడం కష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

HOT NEWS

[X] Close
[X] Close