అంతన్నా.. ఇంతన్నా.. ప్రకాష్‌రాజ్‌కు రెండు శాతం ఓట్లే..!

“జస్ట్ ఆస్కింగ్” అంటూ.. ప్రకాష్ రాజ్ చేసిన హడావుడికి దక్కిన ప్రతిఫలం .. రెండు శాతం ఓట్లే. స్నేహితురాలు గౌరీలంకేష్ హత్య తర్వాత ఒక్క సారిగా… మోడీని విమర్శిస్తూ.. రాజకీయ చిత్రపటంపైకి వచ్చిన .. ఆయన… సోషల్ మీడియాలో.. కాస్త క్రేజ్ తెచ్చుకున్నారు. దక్షిణాది మొత్తానికి పరిచయమైన నటుడు కావడంతో… ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారనే సరికి ఆసక్తి ఏర్పడింది. చివరికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే..కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

ప్రకాష్‌రాజ్‌ని లైట్ తీసుకున్న బెంగళూరు సెంట్రల్..!

ప్రకాష్ రాజ్… సామాజిక అంశాలపై… చురుగ్గా స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో మాత్రమే.. ఆయనకు యాంటీ మోడీ… ఫాలోయర్స్ ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయనకు అంత మంచి ఇమేజ్ లేదు. ఎన్ని చిత్ర పరిశ్రమల్లో పని చేసినప్పటికీ.. ఎక్కడా ఆయన మంచి వ్యక్తిత్వం అనే ముద్ర వేసుకోలేకపోయారు. అదే తరహా.. వ్యక్తిత్వం రాజకీయాల్లోనూ చూపారు. పూర్తిగా యాటిట్యూడ్ ధోరణితో వ్యవహరించడంతో.. అసలు.. బెంగళూరు సెంట్రల్‌లో.. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు కూడా పట్టించుకోలేదు. ఆయన పూర్తిగా.. యాంటీ మోడీ విధానంపైనే ఆధారపడటం.. బెంగళూరు కోసం ఏం చేస్తారనే విషయంపై స్పష్టంగా చెప్పలేకపోవడంతో.. మొదటికే మోసం వచ్చింది.

మీడియా ఎంత హైప్ చేసిన రెండు శాతం ఓట్లే..!

నిజానికి ప్రకాష్‌రాజ్‌ను.. మీడియా మొత్తం ప్రధానమైన పోటీ దారుల్లో ఒకరిగా చూసింది. ఎంతగా అంటే.. జాతీయ మీడియా కూడా… ప్రాధాన్యత ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల గురించి ముఖ్యంగా… బెంగళూరుగురించి ఎక్కడ .. ఏ డిబేట్ పెట్టినా.. ప్రకాష్ రాజ్‌కు ఆహ్వానం అందేది. ఆ డిబేట్లలోప్రకాష్ రాజ్..మోడీని విమర్శిస్తారు. కానీ మోడీని సమర్థించేవాళ్లు అంతకన్నా ఎక్కువగా.. తమ వాదన వినిపిస్తారు. అలా.. ప్రకాశ్ రాజ్ ఎన్నికల రంగంలో కీలకంగా వ్యవహరించారు. కానీ.. చివరికి ఆయన .. కనీస పోటీ దారు కూడా కాదని తేలిపోయింది. దాదాపుగా ఇరవై లక్షల ఓట్లలో.. ఆయనకు వచ్చింది.. పద్దెనిమిది వేల లోపు మాత్రమే. అంటే.. కనీసం.. ఓ నియోజకవర్గ స్థాయిలో… కూడా ప్రకాష్ రాజ్ ప్రభావం చూపలేకపోయారు.

యాటిట్యూడే ప్రకాష్ రాజ్ కొంప ముంచింది..!

నిజానికి ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆయనకు.. కొన్ని పార్టీలు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవి. కాంగ్రెస్ అయినా… డీఎంకే అయినా …. ఆఖరికి తెలంగాణలోని టీఆర్ఎస్ అయినా ఆయనకో అవకాశం ఇచ్చేవి. ఎందుకంటే.. టీఆర్ఎస్ అధినేతతో.. ప్రకాష్ రాజ్‌కు ఇటీవలి కాలంలో సన్నిహిత సంబందాలు ఏర్పడ్డాయి. కేసీఆర్ బీజేపీతో సన్నిహితంగా ఉంటారన్న ప్రచారం ఉన్నా సరే.. తెలంగాణకు వచ్చి అనుకూలంగా ప్రచారం చేశారు. కేసీఆర్ తెలంగాణ నుంచి పోటీ చేయాలి అనుకుంటే.. ఎక్కడో చోట చాన్సిచ్చి ఉండేవాళ్లు. కానీ ప్రకాష్ రాజ్ తనదైన ఆటిట్యూడ్‌తో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. రెండు శాతం ఓట్లకు పరిమితం అయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close