కింకర్తవ్యం..! దిక్కు తోచని స్థితిలో టీడీపీ..!

తెలుగుదేశం పార్టీలో నిశ్మబ్ద వాతావరణం ఏర్పడింది. తమకు ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని ఎవరూ ఊహించ లేదు. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా పది శాతం వరకూ ఉండటం.. వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ హైకమాండ్ పోస్ట్ మార్టం గురించి ఆలోచించడం లేదు. త్వరలోనే కార్యాచరణ ఉండొచ్చని చెబుతున్నారు. అగ్రనేతలు సహా… జిల్లా స్థాయి నేతలందరూ ఫలితాలను చూసి.. దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఎందుకిలా జరిగిందనే దానిపై.. అంతర్గతంగా పరిశీలన చేసుకోవడానికి ప్రాదాన్యం ఇస్తున్నారు.

ఓటమి ఇంత భయంకరమా..?

తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం కూడా.. ఈ ఫలితాల విషయంలో షాక్‌లో ఉంది. సంక్షేమ పథకాలు పొందిన వాళ్లు కూడా ఓట్లు వేయలేదని.. పార్టీకి వచ్చిన ఓట్ల శాతంతో తేలింది. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తోంది. ప్రదానంగా.. పార్టీ యంత్రాంగం.. ఎన్నికల విషయంలో..నిర్లక్ష్యంగా వ్యవహరించారని… సంక్షేమ పథకాలు పొందిన వారితో ఓట్లు వేయించుకునే విషయాన్ని పట్టించుకోలేదని భావిస్తున్నారు. ఈ లోపే వైసీపీ నేతలు వారిని ప్రలోభాలకు గురి చేసి.. ఓట్లు వేయించుకున్నారనే అంచనాకు వస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా.. టీడీపీ హైకమాండ్ పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. అయితే.. ప్రస్తుత ఎన్నికల ఓటమి ప్రభావం.. హైకమాండ్‌ను సైతం షాక్‌కు గురి చేయడంతో.. వారు కూడా మౌనం పాటిస్తున్నారు.

తప్పెక్కడ జరిగింది..?

తెలుగుదేశం పార్టీ ప్రతీ విషయాన్ని పక్కాగా రికార్డు చేసుకుంటుంది. అధ్యక్షుడి దగ్గర్నుంచి కార్యకర్తల వరకూ.,.. కమ్యూనికేషన్ పటిష్టంగా ఉంటుంది. పార్టీకి సంబంధించి సమాచారం అంతా ఎప్పటికప్పుడు.. అప్ డేట్ అవుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల.. తెలుగుదేశం పార్టీ… అంచనాల్లో అంతో ఇంతో స్పష్టత ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి స్పష్టత ఉంది. గెలుపు దిశగా ఉన్నామనే క్షేత్ర స్థాయి సమాచారం పార్టీకి వచ్చింది. నియోజకవర్గ నేతలు కూడా అదే పంపారు. కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. గెలుస్తామని అనుకున్న కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీకి భారీ మెజార్టీలు రావడం..వారిని షాక్‌కు గురి చేసింది. అందుకే తప్పు ఎక్కడ జరిగిందా.. అని గ్రామాల వారీగా విశ్లేషించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితాలపై మీడియాతో మాట్లాడటానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

చంద్రబాబును కదిలించే ప్రయత్నం చేయని నేతలు..!

కౌంటింగ్ ముందు వరకూ.. గెలుపు ఉత్సాహంతో ఉన్న టీడీపీలో… ఇప్పుడు.. పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. తాము ఏం తప్పు చేశామని… ఆవేదన చెందేవారు ఎక్కువ మంది ఉన్నారు. మరికొంత మంది రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని..సర్ది చెప్పుకుని..రోజువారీ రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి టీడీపీ నేతలకు అనూహ్యంగానే ఉంది. టీడీపీ అధినేతను.. ఈ సమయంలో ఎవరూ కదిలించే ప్రయత్నం కూడా చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు...

HOT NEWS

[X] Close
[X] Close