12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ… చేసిన 217 శాంపిల్స్ టెస్టుల్లో ఒక్కటి కూడా పాజిటివ్ కేసు రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో348 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తూండటం.. ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగీలు..వారి కాంటాక్ట్‌లన్నింటిపైనా… అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి క్వారంటైన్‌లకు తరలించడంతో.. ముప్పు తప్పిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రెడ్ జోన్లలో ఉన్న అనుమానితులు… అనుమానితులు కాని వారిని కూడా.. ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. ఇప్పటికే మూడో సారి.. ఇంటింటి సర్వేను ఏపీ సర్కార్ ప్రారంభించారు.దాదాపుగా కోటిన్నర కుటుంబాలు ఏపీలో ఉండటంతో అందరి ఇళ్లకు వెళ్లి.. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. అనుమానితులు ఉంటే.. వారందర్నీ.. తక్షణం క్వారంటైన్‌కు తరలించడమో..వారి శాంపిళ్లను పరీక్షించి.. వైరస్ ఉందో లేదో తేల్చడమో చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికి రెండు సార్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. అయితే.. పలువురు కరోనా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఏపీలో.. విదేశాల నుంచి వచ్చినవారి క్వారంటైన్ పూర్తయింది.వారిలో అనుమానితులు పెద్దగా లేరు. ఉన్న వారిని ఐసోలేషన్ లో ఉంచారు. ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని… ఇక కరోనా కేసులు బయటపడినా..పెద్ద ఎత్తున ఉండవని..ఏపీ ప్రభుత్వ వర్గాలు అంచనాతో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close