అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం… దానిపైనే దృష్టి పెట్టినా… హఠాత్తుగా వర్శిటీల పాలకమండళ్లను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం అసలు సమస్యను కాక.. ఇతర అంశాల్లోనే చురుగ్గా ఉందేమోనని అనుకునేలా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. సిఫార్సుల మేరకు.. ఒకే సామాజికవర్గానికి అత్యధికం కట్టబెట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్ని యూనివర్శిటీల పరిధిలోని పాలక మండళ్లలో మెజార్టీ ఒకే సామాజికవర్గం వారు ఉన్నారు. నియమితులైన వారందరూ… సిఫార్సుల మీద వచ్చిన వారే. ఎవరెవరు సిఫార్సు చేశారో కూడా.. . ఫైల్స్‌లో రాయడం.. సంచలనం సృష్టిస్తోంది.

మీడియాలో ఏపీ సర్కార్ తీరుపై ఒక్క సారిగా విమర్శలు రావడంతో… దానికి కౌంటర్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. మీడియా పైనా.. టీడీపీపైనా ఎదురుదాడి చేశారు కానీ.. నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేశారనే ఆరోపణలు మీడియా నుంచి.. విపక్ష నేతల నుంచి వచ్చాయి. అయితే.. తాము యాభై శాతం మేర.. రిజర్వేషన్లు పాటించామని.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించామని చెప్పుకొచ్చారు. పచ్చ మీడియా అంటూ… ఈ ఆరోపణలు చేసిన వారిపై మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అంత కంటే దారుణంగా నియామకాలు జరిగినా ప్రశ్నించలేదని తప్పు పట్టారు.

ప్రభుత్వ వ్యవహారాల్లో జరుగుతున్న ప్రతి పనిలోనూ… విమర్శలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల ఎదురుదాడి.. అయితే పచ్చ మీడియా అని లేకపోతే.. వాళ్లని ఫలానా సామాజికవర్గమనే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప… తమపై వచ్చిన ఆరోపణలకు.. సమాధానం ఇవ్వడానికి సిద్ధపడలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అలా చేసిందని వాదిస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం అలాగే చేసిందని ఎదురుదాడి చేస్తే.. ఆ ప్రభుత్వానికి ప్రజలు ఏ గతి పట్టించారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. మరి వాళ్లు చేసినట్లుగానే మేము చేస్తామనే వాదనను ఎందుకు వైసీపీ సర్కార్ చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా...

HOT NEWS

[X] Close
[X] Close