తెలంగాణలో బహిరంగంగా ఉమ్మి వేసినా కేసు..!

వైరస్ అంకంతకూ వ్యాపిస్తూండటంతో తెలంగాణ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో పాన్‌, తంబాకు ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజారోగ్యం దృష్ట్యా…నిర్ణయం తీసుకున్నట్లుగా భుతవం చెప్పింది. తుమ్ము తుంపరలు, ఉమ్మి, తెమడ వల్ల కరోనా వ్యాపిస్తుండటం.. ఒక వ్యక్తి ద్వారా నెలలో ఈ వైరస్‌ 406 మందికి వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్‌ సర్వేలో తేలడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగీల వల్ల.. విపరతీంగా.. వైరస్ కేసులు బయటపడుతున్నాయి. వారు.. వారి కాంటాక్ట్ కేసుల కారణంగా… తెలంగాణలో.. పాజిటివ్ కేసులు.. అంతకంతకూ పెగిరిపోతున్నాయి. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్‌గా ఉంటుందని కేసీఆర్ భావించారు. కానీ ఆ తర్వాతే.. తబ్లిగీల కేసులు బయటకు వచ్చాయి. దాంతో.. ఇప్పుడు.. కేసులు 450కి చేరువుగా వచ్చాయి. ఈ కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్‌ను ఎత్తివేయవద్దని.. మొదటిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మిగిలిన రాష్ట్రాలు సమర్థిస్తున్నాయి.

తెలంగామలో వైరస్ వ్యాప్తి అయ్యే ప్రాంతాలుగా.. నాలుగు రోజులు కిందట.. 50 ప్రాంతాలనే హాట్ స్పాట్లుగా గుర్తించారు. కానీ ఇప్పుడు.. ఆ సంఖ్యను.. 125 కు పెంచారు. హైదరాబాద్ పరిధిలోనే 60 హాట్ స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాట్‌స్పాట్లలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ముందు నిర్ణయించింది. ఆ ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలను మోహరించారు. మరో రెండు రోజుల పాటు భారీగా పాజిటివ్ కేసులు బయటపడతాయని.. ఆ తర్వాత తగ్గిపోతాయని.. ఈటల చెబుతున్నారు. అయితే.. పరిస్థితులు అలా లేవని.. నిపుములు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సర్పంచ్‌తో సీఎం..! కేసీఆర్ స్టైలే వేరు..!

తెలంగాణ సీఎం కేసీఆర్... ఓ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలంటే.. చాలా సింపుల్ టెక్నిక్ ఎంచుకుంటారు. గతంలో రెవిన్యూ సంస్కరణలు తేవాలనుకున్నప్పుడు.. భూవివాదాన్ని పరిష్కరించుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక సోషల్ మీడియాలో పోస్టు...

అమర్‌గారూ.. ఆ వాదనలు అక్కడ చెల్లవండి..!

శ్రీవారి భూముల్ని అమ్మాలని తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు. దానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను..! మరి టీటీడీ బోర్డు చైర్మన్‌ను ఎవరు నియమించారు..? టీటీడీకి స్వతంత్ర బోర్డు ఉంటుంది.. వారు...

ఏడాది యాత్ర 7: విద్య, వైద్య రంగాలపై దీర్ఘకాలిక వ్యూహం..!

ఆంధ్రప్రదేశ్‌లోముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఆయన పరిపాలనా సంస్కరణలతో పాటు.. ప్రజల స్థితిగతుల్ని మార్చగలికే.. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విప్లవాత్మక మార్పుల...

కోట్లకు కోట్ల కరెంట్ పనులు..! ఎవరా వీవీఐపీలు..?

ఓ ఇల్లు కడితే ఎంత అవుతుంది..? సామాన్యుడు డబుల్ బెడ్ రూం ఇల్లుని లగ్జరీగా కట్టుకుంటే రూ. 50 లక్షలు అవుతుంది. ధనవంతుడు విల్లాలా కట్టుకుంటే.. రెండు, మూడు కోట్లు అవుతుంది. కుబేరుడు వంద...

HOT NEWS

[X] Close
[X] Close