విపక్షాల ఆనైక్యతే మోడీకి అండ..! ప్రధాని అభ్యర్థిని తేల్చుకోవడం సాధ్యమేనా..?

ఢిల్లీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రచార గడువు ముగియడంతో.. ఇక అన్ని పార్టీల నేతలు .. తదుపరి రాజకీయంపై దృష్టి పెట్టారు. ప్రధాని అభ్యర్థిపై బీజేపీలో పేచీ లేదు. కానీ.. ఈ సారి హంగ్ ఖాయమని జరుగుతున్న ప్రచారంతో.. విపక్ష పార్టీల్లోనే.. ఈ ప్రశ్న తలెత్తుతోంది. మోదీకి ధీటైన నేతలు ఉన్నారని… కాంగ్రెస్ తో పాటు.. విపక్షాలు చెబుతున్నాయి. మరి ఆ ధీటైన నేతకి ఏకాభిప్రాయం దొరికే అవకాశం కనిపించడం లేదు.

కూటమికి ఉన్న “మోడీ” ఎవరు..?

మోదీ కంటే సమర్థులైన నేతలు.. చాలా మంది ఉన్నారని… బీజేపీయేతర పార్టీలు చెప్పుకొస్తున్నాయి. అయితే.. ఇప్పుడా నేతను…ఎంచుకోవాల్సిన సమయం దగ్గర పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చే 23వ తేదీ కల్లా.. ఓ అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి హడావుడి ప్రారంభమయింది. బీజేపీయేతర పార్టీలు ఇప్పటికి ఓ కూటమిగా ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో.. ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, జేడీఎస్ లాంటి పార్టీలు మాత్రమే ఉన్నాయి. కానీ.. కూటమిలో చేరకపోయినప్పటికీ.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ… జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్న పార్టీలు ఎక్కువే ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ , తెలుగుదేశం ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి. మరి కొన్ని చిన్న పార్టీలు… కూడా బీజేపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నాయి. ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమిలో చేరుతాయా.. లేదా అన్నదానిపై క్లారిటీ రావాలంటే.. ముందుగా ఓ నాయకుడ్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది..

నేతల ఆశలతోనే అసలు సమస్య..!

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదైనా కూటమి ఏర్పడితే సహజంగా.. ఏ పార్టీ అధినేత ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆ పార్టీ అధినేత ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారు. కానీ రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం లేదు. చివరికి యూపీఏలోని… మిత్రపక్షం అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా… ప్రధానిగా మాయవతి , మమతా బెనర్జీ లేకపోతే చంద్రబాబునాయుడు అనే చాయిస్ చెప్పారు తప్ప రాహుల్ అనలేదు. అయితే.. రాహుల్ గాంధీకి … స్టాలిన్ , తేజస్వి లాంటి కూటమి నేతల మద్దతు కూడా ఉంది. ఇక బీజేపీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదనుకుంటున్న పార్టీలయిన ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, టీడీపీల్లోనూ.. రాహుల్ గాంధీ నాయకత్వంపై భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఎస్పీ, బీఎస్పీ కూటమి మాయావతిని ప్రధానిగా ప్రతిపాదిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్.. తమ అధినేత్రి మమతా బెనర్జీని తెర ముందుకు తీసుకు వస్తోంది. దీంతో.. చిక్కు ముడి పడుతోంది. ప్రధాని అభ్యర్థి తేలలేదు కాబట్టే.. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ 23వ తేదీన జరగనున్న విపక్షాల భేటీకి హాజరు కావడం లేదని చెబుతున్నారు.

కాంగ్రెస్ మెతక వైఖరీ ఇబ్బందికరమే..!

… కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్.. కాంగ్రెస్ నేతే ప్రధాని కావాలన్న రూలేమీ తాము పెట్టుకోలేదని… గురువారం ప్రకటన చేశారు. కానీ.. ఒక్క రోజులోనే మళ్లీ మాట మార్చారు. కూటమిలో అతి పెద్ద పార్టీకే ప్రధానమంత్రి పదవి అనేది తమ విధానమని చెబుతున్నారు. అంటే.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ప్రధానమంత్రి అని… ఆజాద్ చెప్పినట్లయింది. దీంతో మరింత చిక్కుముడి పడే పరిస్థితి ఏర్పడింది. ప్రాంతీయ పార్టీల కన్నా.. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే విషయంలో .. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ… యూపీఏలోని పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, టీడీపీలు.. అన్నీ కలిపి.. కాంగ్రెస్ పార్టీ కన్నా… ఎక్కువగా సీట్లు సాధిస్తే మాత్రం.. రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోవచ్చు. అప్పుడు.. కూటమి నేతను ఏకాభిప్రాయం మీద ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో.. పార్టీలు ముందడుగు వేసేలోపు… మోడీ, షాలు పని చక్కబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close