విజ‌య‌శాంతి కాదంటే.. ఆప్ష‌న్ ఏమిటి?

మ‌హేష్‌బాబు – అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెరకెక్క‌బోతున్న సంగతి తెలిసిందే. మ‌హ‌ర్షి త‌ర‌వాత‌… ప‌ట్టాలెక్క‌బోయే మ‌హేష్ సినిమా ఇదే. ఇందులో విజ‌య‌శాంతి ఓ కీల‌క‌పాత్ర పోషించ‌బోతోందన్న వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి చేయ‌ద‌గ్గ ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర ఉన్న మాట వాస్త‌వ‌మే. ఆ పాత్ర కోసం విజ‌య‌శాంతిని సంప్ర‌దించిన మాటా నిజ‌మే. కాక‌పోతే.. ఇప్ప‌టి వ‌ర‌కూ రాముల‌మ్మ ఈ సినిమాకి ఓకే చెప్ప‌లేద‌ని టాక్‌. సినిమా ప్రారంభం అవ్వ‌డానికి కాస్త స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, విజ‌య‌శాంతి త‌న నిర్ణ‌యాన్ని హోల్డ్ లో పెట్టింద‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ చివ‌రి నిమిషంలో విజ‌య‌శాంతి కాదంటే ఏమిటి? అనే సందిగ్థంలో ఉంది చిత్ర‌బృందం. అందుకే త‌గిన‌న్ని ఆప్ష‌న్లు రెడీ చేసుకొంటోంది. ర‌మ్య‌కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌ల‌లో ఎవ‌రినో ఒక‌రిని ఈ పాత్ర కోసం తీసుకోవాల‌ని భావిస్తోంది. విజ‌య‌శాంతి నో చెప్పిన ప‌క్షంలో వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఫైన‌ల్ అవ్వ‌డం ఖాయం. ర‌మ్య‌కృష్ణ టీమ్‌లోకి రావ‌డం పెద్ద క‌ష్ట‌మైన విష‌య‌మేమీ కాదు. పాత్ర న‌చ్చితే తాను ఓకే అంటుంది. పైగా ర‌మ్య న‌టించ‌డం కొత్త‌గానూ ఏం ఉండ‌దు. ర‌మ్య‌కృష్ణ కంటే జ‌య‌ప్ర‌ద మంచి ఆప్ష‌న్ అన్న‌ది అనిల్ రావిపూడి న‌మ్మ‌కం. అయితే జ‌య‌ప్ర‌ద ప్ర‌స్తుతం ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉంది. వాటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి త‌న‌కు కాస్త స‌మ‌యం ప‌డుతుంది. విజ‌య‌శాంతి త‌ప్ప‌కుండా త‌మ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంటుంద‌ని, కాని ప‌క్షంలో అప్పుడు మ‌రో ఆప్ష‌న్ గురించి ఆలోచిద్దామ‌ని అనిల్ రావిపూడి చెబుతున్నాడ‌ట‌. మ‌రి ఏం జ‌రుగుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

పుస్త‌క రూపంలో ‘పూరీఇజం’

పూరి సినిమాల్లో డైలాగులు ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయ‌గ‌ల‌డు. అవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం కాదు. త‌న జీవ‌న శైలే అలా ఉంటుంది....

పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా `రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌`

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ర‌కాల సినిమాలే త‌యార‌వుతున్నాయి. ఓటీటీలో అవే విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న సినిమాలు, రెండోది రాంగోపాల్ వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలు. బ‌యోపిక్‌ల పేరుతో.. వాస్త‌వ...

గంటాను వైసీపీలో చేరకుండా అడ్డుకునే శక్తి ఆ ఇద్దరికి ఉందా..?

గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నరాని.. వైసీపీలో చేరబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సహజంగా అయితే... టీడీపీలో ఇది కలకలం రేపాలి. కానీ.. టీడీపీలో అందరూ నింపాదిగా.. గంటా వెళ్తేనే మంచిదన్నట్లుగా ఉన్నారు. కానీ.....

HOT NEWS

[X] Close
[X] Close