టీటీడీ బంగారంపై విచారణ ఆత్రుత..! విజయసాయిరెడ్డి నెల కూడా ఆగలేరా..?

బ్యాంక్ బంగారం తరలిస్తున్నప్పుడు.. టీటీడీ అధికారులు ఎందుకు లేరు..?. బంగారం వాహనం… హైవే మీదుగా రాకుండా వేరే దారుల్లో ఎందుకు వస్తోంది..?. టీటీడీ బంగారాన్ని ఈసీ అధికారులు పట్టుకున్న ఘటనపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదు..?.. ఇవీ టీటీడీకి చెందిన బంగారాన్ని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు తరలిస్తున్న వివాదంపై.. విజయసాయిరెడ్డికి వచ్చిన డౌట్లు. బంగారాన్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దేనని.. వాళ్లు ఎలా తీసుకొస్తారో.. తమకు అనవసరం అని టీటీడీ చెబుతోంది. వాళ్లు తీసుకొచ్చి.. టీటీడీ ఖజానాకు జమ చేసినప్పుడు మాత్రమే.. బంగారం స్వాధీనం చేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు… స్వాధీనం చేసే వరకూ.. బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ దే అవుతుంది. అప్పుడు టీటీడీ అధికారులు.. ఆ బ్యాంక్ వెంట.. ఆ బంగారం వెంట ఎందుకుంటారో విజయసాయిరెడ్డికే తెలియాలి.

డిపాజిట్ గడువు తీరిన బంగారాన్ని పీఎన్బీ.. టీటీడీకి అప్పగించే క్రమంలో ఈసీ అధికారులు పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపించలేదన్న కారణంగా స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు తర్వాత పత్రాలు చూపించడంతో విడుదల చేశారు. బ్యాంక్ అధికారులు.. దాన్ని తీసుకొచ్చి టీటీడీ ఖజానాలో జమ చేశారు. ఇదో పెద్ద వివాదం అయినట్లుగా.. ఈసీ నియమించిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం … విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా.. మన్మోహన్ సింగ్ ను నియమించారు. ఆయన విచారణ జరిపి.. నివేదికను… సీఎస్‌కు ఇస్తున్న సమయంలోనే.. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. గందరగోళమైన ఆరోపణలు చేశారు. టీటీడీ ఈవోకు ఎలా పోస్టింగ్ వచ్చిందో.. మన్మోహన్ సింగ్ విచారణ చేయాలనే వింత డిమాండ్ ను కూడా విజయసాయిరెడ్డి చేశారు. మన్మోహన్‌సింగ్‌ విచారణ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

నెల రోజుల్లో అధికారం తమదే అంటున్న విజయసాయిరెడ్డి… ఇప్పుడు.. ఎందుకు అంతగా విమర్శలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారం అందుతుందన్న కాన్ఫిడెంట్ ఉంటే.. నెల రోజుల తర్వాత.. వాటిపై నేరుగా విచారణ జరిపించుకోవచ్చు కదా.. అనే సెటైర్లు సోషల్ మీడియాలో పడుతూనే ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా… అర్థం పర్థం లేని ఆరోపణలతో… అసభ్యమైన పదాలతో.. అధికారపక్షంపై దాడి చేసి.. ఏం రాజకీయం చేస్తారన్న కామెంట్లు.. ఇతరుల నుంచి వస్తున్నాయి. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. ఆయన పంధాలో ఆయన వెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తనను వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్ సుధాకర్ లేఖ..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనకు వాడుతున్న మందులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. డాక్టర్ సుధాకర్... ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సంచలన లేఖ రాశారు. తనకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల.. తనకు సైడ్ ఎఫెక్ట్స్...

ప‌ర‌శురామ్ క‌థ మార్చేశాడా?

మ‌హేష్‌బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. లాక్ డౌన్ ఎత్తేశాక‌... మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. క‌థ పూర్త‌య్యింది. ఈ సినిమా కోసం `స‌ర్కారు వాటి పాట‌` అనే టైటిల్...

లాక్‌డౌన్ టైమ్‌లో ఫిట్‌నెస్‌ గోల్స్ సాధించిన లోకేష్..!

నారా లోకేష్ లాక్ డౌన్ సమయాన్ని చాలా పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. వ్యక్తిగత గోల్స్ సాధించారు. తన బరువును రెండు నెలల్లో కనీసం ఇరవై కిలోల మేర తగ్గించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మహానాడు...

కన్నా మళ్లీ చంద్రబాబుకు అమ్ముడు పోయారట..!

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను వైసీపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆయన వైసీపీ స్టైల్లో... దూకుడైన ఆరోపణలు.. విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. దేవుడి ఆస్తులపై...

HOT NEWS

[X] Close
[X] Close