ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్‌: ఓన్లీ ఫ‌ర్ ఫ‌న్‌

వ‌రుస హిట్ల‌తో దూసుకొచ్చాడు రాజ్ త‌రుణ్‌. ఎంత వేగంగా వ‌చ్చాడో, అంతే వేగంగా కింద‌కు ప‌డ్డాడు. ఇప్పుడు తాను పైకి లేవ‌డానికి ఓ ఊతం కావాలి. విజ‌య్ కుమార్ కొండా, హెబ్బా ప‌టేల్ లాంటి వాళ్ల‌కూ ఓ హిట్టు అత్య‌వ‌స‌రం. వీళ్లంతా క‌లిసి చేసిన ప్ర‌య‌త్నం `ఒరేయ్ బుజ్జిగా..`.

లాక్ డౌన్ వ‌ల్ల‌, థియేట‌ర్లు లేక‌పోవ‌డం వ‌ల్ల ఓటీటీకి ప‌రిమిత‌మైపోయిన మ‌రో సినిమా ఇది. అక్టోబ‌రు 2న ఆహాలో విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ ని వ‌దిలారు. ఇదో ఫ‌న్ రైడ్ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైపోతుంది. అటు.. రాజ్ త‌రుణ్‌, ఇటు మాళ‌విక నాయ‌ర్‌.. ఇద్ద‌రి క్యారెక్ట‌రైజేష‌న్లూ డిఫ‌రెంట్ గానే క‌నిపిస్తున్నాయి. చాలా రోజుల త‌ర‌వాత వాణీ విశ్వ‌నాథ్ మ‌ళ్లీ తెర‌పై క‌నిపిస్తోంది. ఆమె పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా ఉండే అవ‌కాశం ఉంది. స‌ప్త‌గిరి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌. పోసాని… ఇలా కామెడీ ప్యాడింగ్ బాగానే ఉంది. రాజ్ త‌రుణ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. కాక‌పోతే.. ఈమ‌ధ్య మాస్ సినిమాలు, విషాదంత‌మైన ప్రేమ‌క‌థ‌లూ ఎంచుకుని పెద్ద పెద్ద త‌ప్పులు చేశాడు. త‌న‌కు సూట‌య్యే క‌థ‌ని ఎంచుకున్నాడ‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓటీటీలో విడుద‌లైన సినిమాల‌న్నీ కాన్సెప్ట్ ఓరియెంటెర్‌, లేదంటే థ్రిల్ల‌ర్ జోన‌ర్ కి ప‌రిమిత‌మ‌య్యాయి. పూర్తి వినోదాత్మ‌క చిత్రం ఇదే కావొచ్చు. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.