గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట ఆడుకున్న వైసీపీ ఇప్పుడు ఏపీ పోలీసులే తమ చేతులో ఉండటంతో ఏం చేయగలదో అది చేసి చూపిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలకు ఏపీ నుంచి వెళ్తున్న గంజాయి వ్యవహారంలో అక్కడి పోలీసులు ఏపీ నుంచి వస్తుందని చెప్పడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. వారంతా చంద్రబాబు కుట్రలో భాగస్వాములని.. ఆరోపించడం ప్రారంభించారు.

హైదరాబాద్ కమిషనర్ తో పాటు నల్లగొండ ఎస్పీ కూడా ఏపీ నుంచి గంజాయి వస్తోందని ఇటీవల స్పష్టంగా ప్రకటించారు. మ్యాప్‌లు చూపించి మరీ ఎలా వస్తుందో చెప్పారు. వీళ్లిద్దరే కాదు ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల పోలీసులూ అదే చెప్పారు. ఇప్పుడు వీళ్లందర్నీ షరా మామూలుగా టీడీపీ ఏజెంట్లు.. చంద్రబాబుతో కలిసి కుట్ర చేశారంటూ ఆరోపణలు ప్రారంభిచేశారు వైసీపీ పార్టీ నేతలు. ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి విజయసాయిరెడ్డి ఇదే చెప్పారు. పైగా తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆధారాలు లేకుండానే రాత్రికి రాత్రి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కానీ ఆధారాలుంటే ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టారో ఆయన చెప్పలేకపోయారు.

తమ ప్రతి వైఫల్యానికి చంద్రబాబు కారణంగా చెప్పడం వైసీపీ విధానాల్లో ఒకటి. అయితే రాష్ట్రంలో వరకు అయితే సరే ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు కూడా చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అని చెబితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏపీలోని పోలీసులే ఇప్పుడు చంద్రబాబు మాట వినడం లేదు. ఇక పక్క రాష్ట్రాల పోలీసులు వింటారా…? ప్రజల్ని.. యువతను నిర్వీర్యం చేస్తున్న ఓ మహమ్మారి గురించి పట్టించుకోకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై కుట్ర సిద్ధాంతాలు వల్లిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోంది. అందు కోసం ఆ కేసుల్ని బయట పెడుతున్న పోలీసుల్ని సైతం వదిలి పెట్టడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close