కోలీవుడ్ కీల‌క నిర్ణ‌యం.. టాలీవుడ్ లోనూ ఆచ‌ర‌ణీయం

సినిమా.. ఓ ప‌రిశ్ర‌మ‌. దేశం మొత్తం మీద‌.. ప్ర‌తీ యేటా వేయికి పైగా చిత్రాలు నిర్మిత‌మ‌వుతాయి. ల‌క్ష‌లాది కుటుంబాలు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చిత్ర‌సీమ‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతుంటారు. ప్ర‌భుత్వానికీ ఓర‌కంగా అతి పెద్ద ఆదాయ మార్గం. అయితే… చిత్ర‌సీమ‌లో ఎన్నో వ్య‌ధ‌లు. క‌న్నీళ్ల క‌థ‌లు. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కూర్చి ఓసినిమా నిర్మిస్తే.. అది విడుద‌ల అవుతుందో, లేదో చెప్ప‌లేం. చిన్న సినిమాల‌కు ఈ ప‌రిస్థితి త‌ర‌చూ ఎదుర‌వుతూనే ఉంటుంది. టాలీవుడ్ లోనే చూడండి. ఏటా.. మూడొంద‌ల‌కు పైగా చిత్రాలు నిర్మిత‌మైతే అందులో క‌నీసం 20 శాతం సినిమాలు విడుద‌ల‌కు నోచుకోవు. థియేట‌ర్లు దొరక్క‌, వ్యాపారం జ‌ర‌క్క‌. లాబుల్లోనే మ‌గ్గిపోయే సినిమాలెన్నో. ఓ సినిమా విడుద‌ల ఆగిపోతే.. స‌దరు నిర్మాత‌కు కోట్ల‌లో న‌ష్టం వ‌స్తుంది. తెలుగులోనే కాదు, అన్ని భాష‌ల్లోనూ ఇదే స‌మ‌స్య‌.

ఈ స‌మ‌స్య‌కు కోలీవుడ్ ఓ ప‌రిష్కార మార్గాన్ని అన్వేషిస్తోంది. త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి ఈ రోజు ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. 2015 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. షూటింగ్ పూర్త‌యి, విడుద‌ల కాని సినిమాల జాబితాను సేక‌రిస్తోంది. కొన్ని సినిమాలు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు సైతం పూర్త‌వ్వ‌క‌ముందే ఆగిపోతుంటాయి. అలాంటి సినిమాల జాబితానీ సిద్ధం చేస్తోంది. త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ఆధ్వ‌ర్యంలో ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్థాపించాల‌న్న‌ది ప్ర‌య‌త్నం. ఆ ఓటీటీ ద్వారా ఈ సినిమాల‌న్నీ విడుద‌ల చేస్తారు. ఆయా సినిమాల వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం మొత్తం ఆ నిర్మాత‌ల‌కే చెందేలా ప్ర‌ణాళిక‌లు, ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తున్నారు. నిజానికి ఇదో మంచి నిర్ణ‌యం. చిన్న సినిమాల‌కు చేయూత నిచ్చే ఆలోచ‌న‌. తెలుగులోనే కాదు.. అన్ని భాష‌ల్లోనూ ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాలి. ఎందుకంటే ఇప్పుడున్న‌ప‌రిస్థితుల్లో సినిమాని ఓటీటీల‌కు అమ్ముకోవ‌డం కూడా క‌ష్టం అవుతోంది. పేరున్న న‌టీన‌టులు ఉన్న సినిమాల‌కే ఓటీటీలు పెద్ద పీట వేస్తున్నాయి. దాంతో చిన్న సినిమాల‌కు అక్క‌డ కూడా గిరాకీ ఉండ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నిర్మాత‌ల మండ‌లే ఓ ఓటీటీ సంస్థ‌ని ఏర్పాటు చేయ‌డం, అందులో చిన్న సినిమాల‌నే తీసుకోవ‌డం, ఆ లాభాల‌న్నీ నిర్మాత‌ల‌కే ద‌క్క‌డం ఓ మంచి ఆలోచ‌న‌. చూద్దాం. ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అవుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close